Leading News Portal in Telugu

Australia: ఆస్ట్రేలియాలో దారుణం.. ఘర్షణలో భారత్ విద్యార్థి మృతి



Akeke

ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. భారతీయ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు దుర్మరణం చెందారు. మృతుడు హర్యానాలోని కర్నాల్ ప్రాంతానికి చెందిన వాసిగా గుర్తించారు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

మెల్‌బోర్న్‌లో శనివారం రాత్రి 9 గంటలకు అద్దె చెల్లించే విషయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అరుపులు, కేకలు వేసుకుంటూ పెద్ద గొడవ చోటుచేసుకుంది. స్నేహితుల్ని విడదీసేందుకు మధ్యలో జోక్యం చేసుకున్న నవ్‌జీత్ సింధును కత్తితో పొడిచాడు. దీంతో ప్రాణాలు కోల్పోయినట్లుగా మృతుడి బంధువు యశ్వీర్ తెలిపారు. ఈ ఘటనలో మరో విద్యార్థి గాయాలపాలయ్యాడు.

ఇది కూడా చదవండి: Asha Sobhana: భారత మహిళా క్రికెట్‌లో ఆశా శోభన సరికొత్త చరిత్ర!

తాను ఉంటున్న ఇంటినుంచి వస్తువులు తెచ్చుకునేందుకు వెంట రావాలని నవ్‌జీత్ సంధును అతడి స్నేహితుడు అడిగాడు. దీంతో ఇద్దరూ కలిసివెళ్లారు. తన స్నేహితుడు ఇంటి లోపలికి వెళ్లిన తర్వాత పెద్ద కేకలు, అరుపులు వినిపించాయి. వారి మధ్య గొడవ జరుగుతుందని అర్థమై.. సంధు కూడా లోపలికి వెళ్లాడు. ఘర్షణ వద్దని వారిని వారించే ప్రయత్నం చేశాడు. అప్పుడే అతడి ఛాతిలోకి కత్తి దూసుకెళ్లింది అని మృతుడి బంధువు వెల్లడించారు. అతడిని తీసుకెళ్లిన మిత్రుడికి మాత్రం గాయాలయ్యాయని చెప్పారు.

ఇది కూడా చదవండి: David Warner: సన్‌రైజర్స్ హైదరాబాద్ వల్ల చాలా బాధను అనుభవించాను.. డేవిడ్ వార్నర్..

ఈ ఘటనకు సంబంధించి ఆదివారం ఉదయం తమకు సమాచారం అందిందని తెలిపారు. ఈ జులైలో నవ్‌జీత్ తను కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాల్సిఉందని, ఇంతలోనే ఇలా జరగడంతో అంతా షాక్‌లో ఉన్నామని వాపోయారు. మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్రప్రభుత్వం సహకరించాలని కోరారు. నవజీత్.. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లారు. నవజీత్ తండ్రి.. ఒకటిన్నర ఎకరాల భూమి విక్రయించి ఆస్ట్రేలియా పంపించినట్లుగా తెలుస్తోంది. నిందితుడిది కూడా అదే ప్రాంతమని సమాచారం.

ఇది కూడా చదవండి: Team India New Jersey: టీ20 ప్రపంచకప్ కోసం కొత్త జెర్సీ.. స్టోర్‌, ఆన్‌లైన్‌లో లభ్యం!