Leading News Portal in Telugu

PM Modi: మంగళవారం ఓటు వేయనున్న మోడీ



Keke

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మంగళవారం మూడో విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. అయితే మూడో విడతలో భాగంగా గుజరాత్‌లో కూడా పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అహ్మదాబాద్‌లోని నిషాన్ ఉన్నత పాఠశాలలో ఆయన తన ఓటు వేయనున్నారు. మూడో దశ పోలింగ్‌లో భాగంగా గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది.

ఇది కూడా చదవండి: Child Marriage: 13 ఏళ్ల బాలికకు 70 ఏళ్ల వృద్ధుడితో పెళ్లి.. ఎక్కడంటే..?

ఇదిలా ఉంటే అహ్మదాబాద్‌ నగరంలోని ఆరు పాఠశాలలకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. డాగ్ స్క్వాడ్‌తో అణువణువు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఫోన్ కాల్ నకిలీవని తెలిసింది. అయినా మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ నగరానికి వస్తుండడంతో.. భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇంకోవైపు గాంధీనగర్ నుంచి కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా బరిలో దిగారు. ఆయన సైతం మంగళవారం.. తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మూడో దశలో మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 95 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో మొత్తం 1,351 మంది అభ్యర్థులు బరిలో దిగారు. మోడీ.. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో మే 13న వారణాసిలో ప్రధాని.. తన నామినేషన్ వేయనున్నారు. అనంతరం వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత వారణాసిలో రోడ్ షోలో ప్రధాని పాల్గొనున్నారు. వారణాసి ఎన్నికల పోలింగ్ చివరి దశలో.. అనగా జూన్ 1న జరగనుంది.

ఇది కూడా చదవండి: Kothapalli Geetha: కొత్తపల్లి గీతకు ప్రధాని మోడీ ఆశీర్వాదం.. చంద్రబాబు ప్రశంసలు

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత మంగళవారం జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.