Leading News Portal in Telugu

HD Revanna: ప్రజ్వల్ తండ్రికి జ్యుడీషియల్ కస్టడీ.. ఎప్పటివరకంటే..!



Hd Ra

మహిళ కిడ్నాప్‌ కేసులో మాజీ మంత్రి, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణకు బెంగళూరు కోర్టు రిమాండ్‌ విధించింది. ఆరు రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపింది. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డ మహిళను కిడ్నాప్‌ చేశారని రేవణ్ణపై కేసు నమోదైంది. ఈ కేసులో రేవణ్ణను ఇటీవలే సిట్‌ అరెస్టు చేసింది. తన తల్లిని కిడ్నాప్‌ చేయడమే కాక ఆమెపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని కిడ్నాప్‌కు గురైన మహిళ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో రేవణ్ణపై కేసు నమోదైంది. హెచ్‌డీ రేవణ్ణను ఈనెల 14వ తేదీ వరకూ జ్యూడిషయల్ కస్టడీలోకి తీసుకోవాలని స్థానిక కోర్టు బుధవారం ఆదేశించింది.

ఇది కూడా చదవండి: PhonePe : గుడ్ న్యూస్.. ఫోన్‌పేలో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చెయ్యాలంటే?

ఈ కేసులో హెచ్‌డీ రేవణ్ణకు విధించిన మూడు రోజుల పోలీస్ కస్టడీ బుధవారంతో ముగిసింది. దీంతో ఆయనను కోర్టు ముందు హాజరుపరచారు. కోర్టు ఈనెల 14వరకూ జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను పరప్పన అగ్రహార జైలుకు సిట్ తరలించింది. పోలీసు కస్టడీలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అని విచారణ సందర్భంగా కోర్టు ఆయనను ప్రశ్నించింది. కడుపునొప్పి కారణంగా తాను గత మూడు రోజులుగా నిద్రపోలేదని, విచారణ పూర్తయిందని వారు చెప్పారని తెలిపారు. తాను ఏదైనా తప్పుచేసి ఉంటే అంగీకరించేందుకు సిద్ధమేనని అన్నారు. ఎమ్మెల్యేగా 25 ఏళ్ల కాలంలో తనపై ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. కడుపునొప్పి విషయాన్ని అధికారులకు చెప్పినప్పటికీ తాను ఆసుపత్రిలో చేరలేదని తెలిపారు. తనకు నిరంతరాయంగా కడుపునొప్పి వస్తోందని, వారెంట్ లేకుండానే తనను అరెస్టు చేశారని చెప్పారు. తాను ఎలాంటి ప్రెస్‌ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయలేదని, అది కూడా అరెస్టుకు ముందు ప్రెస్‌తో మాట్లాడానని అన్నారు. తప్పుడు ఆరోపణలు బనాయించడం ద్వారా రాజకీయ కుట్ర జరుగుతోందని రేవణ్ణ విచారణ సందర్భగా తెలిపారు.

ఇది కూడా చదవండి: Poonch attack: ఉగ్రవాదుల ఫొటోలు విడుదల.. పాక్ హస్తం ఉన్నట్లుగా గుర్తింపు!

హెచ్‌డీ రేవణ్ణ ఫామ్‌హౌస్‌లో గతంలో పనిచేసిన ఒక మహిళను ఏప్రిల్ 29న అపహరణకు గురి కాగా, ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో హెచ్‌డీ రేవణ్ణ, ఆయన సన్నిహితుడు సతీష్ బాబన్నపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.