Leading News Portal in Telugu

Poonch attack: ఉగ్రవాదుల ఫొటోలు విడుదల.. పాక్ హస్తం ఉన్నట్లుగా గుర్తింపు!



Poonch

గత వారం జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌లో వైమానిక దళం కాన్వాయ్‌పై లష్కర్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దీని వెనుక పాక్ హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన మాజీ కమాండో ఈ ఘటనలో నేరుగా పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. దర్యాప్తులో భాగంగా ముగ్గురు ఉగ్రవాదుల చిత్రాలను సేకరించాయి. వీరిలో పాక్‌ సైన్యం ప్రత్యేక దళాల్లో పనిచేసిన ఓ మాజీ కమాండో కూడా ఉండటం విశేషం. ఇల్లియాస్‌, అబూ హమ్జా, హడూన్‌గా గుర్తించారు. కొత్తగా ఏర్పాటు చేసిన పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫోర్స్‌ తరఫున ఈ ముగ్గురు ఉగ్రవాదులు కాన్వాయ్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ జైషే అహ్మద్‌ అనుబంధంగా పనిచేస్తోంది. భద్రతా దళాలు ఈ ఉగ్రవాదులను పట్టుకోవడానికి రాజౌరీ, పూంఛ్‌ జిల్లాల్లో భారీ గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: KGF 3: కేజీఎఫ్ 3పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. ఫ్యాన్స్ రెడీనా..

ముగ్గురు ఉగ్రవాదులు హై పవర్డ్ రైఫిల్స్‌ను ఉపయోగించినట్లు సమాచారం. వీరి వయసు 30-32 ఏళ్ల మధ్య ఉంటుంది. ఏకే 47 రైఫిల్స్‌తో పాటు, అమెరికా తయారీ ఎం-4 కార్బైన్‌ను, స్టీల్‌ తూటాలను వాడినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో కూడా సైనిక వాహనంపై పీఏఎఫ్‌ఎఫ్‌ సంస్థ ఉగ్రవాదులు మాటు వేసి దాడి చేశారు. నాటి ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందారు. అప్పుడు కూడా స్టీల్‌ తూటాలు వాడినట్లు గుర్తించారు.

ఇది కూడా చదవండి: Uttam Kumar Reddy : తడిసిన ధాన్యంపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన

మే 4న కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో వైమానిక దళ సైనికుడు మృతిచెందగా.. ఐదుగురు సహచరులు గాయపడ్డారు. పూంచ్ అనంత్‌నాగ్-రాజౌరీ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఇక్కడ ఆరవ దశలో మే 25న పోలింగ్ జరగనుంది.

ఇది కూడా చదవండి: Car Sales In April 2024 : ఏప్రిల్‌లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు..