
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డుప్రమాదంలో పడి ఉన్న బాధితుడికి దగ్గరుండి సాయం అందించారు. బుధవారం ఘోగోల్ మార్గోలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Ashu Reddy: పేరు మార్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఇప్పుడన్నా కలిసోస్తుందా?
ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బుధవారం ఘోగోల్ మార్గోలో తన కాన్వాయ్‌లో రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. వెంటనే ఆయన కాన్వాయ్‌ను ఆపి ప్రమాదంలో గాయపడ్డ బాధితుడి దగ్గరకు వచ్చి పరామర్శించి.. సహాయం చేశారు. వెంటనే అంబులెన్స్‌ను రప్పించి ఆస్పత్రికి తరలించారు. కార్యకర్తలు, అభిమానులు ప్రమాద బాధితుడికి సహాయం చేశారు.
ఇది కూడా చదవండి: Peddapalli Campaign: పెద్దపల్లిలో వింత ప్రచారం.. ఓటర్ల కాళ్లు పట్టుకున్న అభ్యర్థి
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు ప్రచారంలో బిజిబిజీగా ఉంటున్నారు. తీరిక లేకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కొంత సమయం వెచ్చి బాధితుడికి ఒక సాయం అందించారు. పలువురు ముఖ్యమంత్రి చర్యలను ప్రశంసిస్తున్నారు.
View this post on Instagram