Leading News Portal in Telugu

Kavitha: లిక్కర్ కేసులో కవితపై ఛార్జిషీట్ దాఖలు.. ఈడీ ఏం ఆరోపించిందంటే..!


Kavitha: లిక్కర్ కేసులో కవితపై ఛార్జిషీట్ దాఖలు.. ఈడీ ఏం ఆరోపించిందంటే..!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరో అనుబంధ ఛార్జిషీటును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు దాఖలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మె్ల్సీ కవిత, ఇతర నిందితులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనుబంధ ప్రాసిక్యూషన్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్‌లో కవిత మరియు ఇతరులపై 224 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.


ఇది కూడా చదవండి: Varun Sandesh: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న వరుణ్ సందేశ్.. ‘నింద’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..

ఎమ్మెల్సీ కవిత, మరో నలుగురు నిందితుల పాత్రపై శుక్రవారం దర్యాప్తు సంస్థ ఛార్జీషీట్‌ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో సూత్రధారి, పాత్రధారి కవిత అని వాదనల సందర్భంగా ఈడీ కోర్టుకు తెలియజేసింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేస‌్తున్నట్లు కోర్టుకు ఈడీ వెల్లడించింది. కవిత, ఛన్‌ప్రీత్‌ సింగ్‌, దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌ కుమార్‌, అర్వింద్‌ సింగ్‌ల పాత్రపై సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

ఇది కూడా చదవండి: Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల అభియోగాలను నమోదు చేసిన ఢిల్లీ కోర్టు..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా 10 రోజులు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో మార్చి 26 నుంచి కవిత తీహార్ జైల్లో ఉంటున్నారు. అనంతరం సీబీఐ విచారణకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. మే 24న కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారించనుంది.

ఇది కూడా చదవండి: Avika Gor: ఏంటి భయ్యా చిన్నారి పెళ్లికూతురు ఈ రేంజ్ లో రెచ్చిపోయింది..