Leading News Portal in Telugu

Bihar: కాంగ్రెస్ అభ్యర్థి, తన కొడుకుపై ఫోక్సో కేసు.. కుమారుడి అరెస్ట్


Bihar: కాంగ్రెస్ అభ్యర్థి, తన కొడుకుపై ఫోక్సో కేసు.. కుమారుడి అరెస్ట్

బీహార్‌లోని ససారాం పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ రామ్‌కు కష్టాలు చిక్కుల్లో పడ్డారు. మనోజ్, అతని కుమారుడు ఉజ్వల్ కుమార్‌తో సహా నలుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఓ మైనర్ బాలిక తండ్రి కైమూర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు 2024 ఏప్రిల్ 8న కుద్రా పోలీస్ స్టేషన్‌లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ రామ్ కుమారుడు ఉజ్వల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో మనోజ్‌రామ్‌ను కూడా నిందితులుగా చేర్చారు. కైమూర్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ రామ్ ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించారు.


READ MORE: AP Elections 2024: చివరి రోజు ఏపీకి అగ్రనేతలు.. కడపకు రాహుల్.. తిరుపతికి నడ్డా..

మైనర్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో తన కూతురు మనోజ్ రామ్ కు చెందిన ఓ పాఠశాలలో చదువుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో మనోజ్, అతడి కుమారుడు బాలికను శారీరకంగా హింసించారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, మొబైల్ చాటింగ్, రికార్డింగ్, చిప్ లు ఉన్నాయని బాధితురాలి తండ్రి చెప్పారు. ఉజ్వల్ కుమార్, మనోజ్ కుమార్‌తో సహా మొత్తం నలుగురు వ్యక్తులు లైంగికంగా వేధించారని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనోజ్ రామ్, అతని కుమారుడు ఉజ్వల్ కుమార్ సహా నలుగురిని నిందితులుగా చేస్తూ కుద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.