- కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ షాక్
-
సీఎం ప్రతిపాదన తోసిపుచ్చిన వీకే సక్సేనా

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం-లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా మధ్య వార్ మరింత ముదురుతోంది. ఇప్పటికే ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఎల్జీ తీసుకున్న నిర్ణయంతో ఆ జ్వాలలు మరింత రేకెత్తిస్తున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు తనకు బదులుగా మంత్రి అతిషిచే జరిగించాలని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు జైలు నుంచి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. అయితే ఎల్జీ మాత్రం అందుకు భిన్నంగా హోంమంత్రి కైలాష్ గహ్లాట్‌ను ఎంపిక చేశారు. ఈ పరిణామం ఆప్‌కు పుండిమీద కారం చల్లినట్లుగా అయింది. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ రాసిన లేఖ అందలేదని రాజ్‌భవన్ కార్యాలయం తెలిపింది. మరోవైపు ఈ విధంగా కేజ్రీవాల్ లేఖ రాయడం ముఖ్యమంత్రి అధికారాలను దుర్వినియోగం చేయడమేనని తీహార్ జైలు అధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mars: అంగాకరకుడి ఉపరితలం కింద నీరు..? ఇన్‌సైట్ ల్యాండర్ కీలక డేటా..
జాతీయ జెండా ఆవిష్కరణకు హోంమంత్రి గహ్లాట్‌ను ఎంపిక చేసినట్లు మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్ కార్యాలయం తెలిపింది. హోం మంత్రి కైలాష్ గహ్లాట్‌ను నామినేట్ చేయడం సంతోషంగా ఉందని సక్సేనా అన్నారు.
లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉంటున్నారు. మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఆయన అప్పటి నుంచి తీహార్ జైల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న జాతీయ జెండాను మంత్రి అతిషి చేత ఆవిష్కరించాలని ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ లేఖ మీడియాకు అందింది. అయితే జైలు నిబంధనల ప్రకారం అధికారాల దుర్వినియోగానికి సంబంధించిన లేఖ అని.. అందుకే లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపలేదని జైలు అధికారులు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు చెప్పారు.
ఇది కూడా చదవండి: Harish Shankar: మిస్టర్ బచ్చన్ ట్రూ ఇన్సిడెంట్.. ఎక్కడా లొంగలేదు: డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంటర్వ్యూ