Leading News Portal in Telugu

Viral Video: ఇది రైలు కాదు గురూ.. ఇల్లు (వీడియో)



  • కేరళలోని కోజికోడ్‌లో ఓ ఆశ్చర్యకరమైన క్రియేటివిటీ
  • వీడియో వైరల్
  • ఇంటి కంఫౌండ్ గోడలను పూర్తి రైలులా మార్చిన వైనం
Viral Video: ఇది రైలు కాదు గురూ.. ఇల్లు (వీడియో)

కేరళలోని కోజికోడ్‌లో ఓ ఆశ్చర్యకరమైన క్రియేటివిటీ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇక్కడ ఒక వ్యక్తి తన ఇంటి కంఫౌండ్ గోడలను పూర్తి రైలులా కనిపించే విధంగా ప్రత్యేకమైన డిజైన్‌గా మార్చాడు. ఈ వీడియో ఎక్స్ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయబడింది. ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి తన రిటైనింగ్ వాల్‌ని మొత్తం రైలు, ఇంజన్, ఇతర కోచ్‌ల మాదిరిగా రూపొందించినట్లు వీడియోలో చూడవచ్చు. దూరం నుంచి చూస్తే.. రైలు స్టేషన్‌లో నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ప్రత్యేకమైన డిజైన్ స్థానికులను మాత్రమే కాకుండా ప్రపంచ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచింది. సృజనాత్మకతకు హద్దులు లేవని ఈ వీడియో నిరూపించింది. ఈ ప్రత్యేకమైన డిజైన్ దృష్టిని ఆకర్షించడమే కాకుండా వ్యక్తిగత అభిరుచులు, ఆసక్తులను ప్రదర్శిస్తోంది.

READ MORE: Test Cricket: టెస్ట్‌ల్లో సచిన్ రికార్డును బద్దలు కొట్టగల ఆటగాడే అతడే..!

ఈ వీడియోను ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా వీక్షించగా.. 3.2 వేల మంది లైక్‌లు వచ్చాయి. సోషల్ మీడియాలో యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేశారు. ఒక వినియోగదారు ఇలా రాశారు.. “ఆ ఇంట్లో రైల్వే ఉద్యోగి కుటుంబం ఉండాలి” అని కామెంట్ చేశారు. మరొకరు “ఇది అద్భుతమైన సృజనాత్మకత” అని పేర్కొన్నారు. కొంతమంది వినియోగదారులు.. “ఈ ఇంటి లోపలికి వెళ్లడానికి మీరు టికెట్ కొనాలి” అని రాశారు. మరొక వినియోగదారు “ఈ రైలు ఎప్పటికీ పట్టాలు తప్పదు” అని అన్నారు.