Leading News Portal in Telugu

UP Video: యూపీలో వీధి కుక్కు స్వైర విహారం.. గంటలో 17 మందిపై ఎటాక్


  • యూపీలో వీధి కుక్కు స్వైర విహారం

  • గంటలో 17 మందిపై దాడి
UP Video: యూపీలో వీధి కుక్కు స్వైర విహారం.. గంటలో 17 మందిపై ఎటాక్

ఈ మధ్య కుక్కలు.. మనుషులపై ఎలా దాడి చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇక చిన్నపిల్లల ప్రాణాలైతే గాల్లో కలిసిపోతున్నాయి. ఇలా దేశంలో ఆయా చోట్ల ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. కనిపించిన వారిని కనిపించినట్లే మీద పడి గాయపరిచింది. చిన్న, పెద్ద తేడా లేకుండా గంట వ్యవధిలోనే 17 మందిపై దాడి చేసింది. కుక్క దాడిలో గాయపడిన వారిలో మహిళతోపాటు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఈ ఘటన గోరఖ్‌పూర్‌లోని షాపూర్‌లో ఆగష్టు 14న జరగ్గా.. సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. తాజాగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Delhi Crime: కాబోయే వాడితో కలిసి కన్నతల్లిని హతమార్చిన మహిళ..

22 ఏళ్ల విద్యార్ధి ఆశిష్‌ యాదవ్‌.. ఆవాస్‌ వికాస్‌ కాలనీలోని తన ఇంటి ముందు నిలబడి ఫోన్‌లో మాట్లాడుతుండగా వీధి కుక్క అమాంతంగా దాడి చేసింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వెంటనే తేరుకుని ఎదురుదాడి చేశాడు. అయినా కూడా కుక్క బెదరకుండా పైకి ఎగిరి దాడి చేసింది. ఆశిష్ కిందపడిపోవడంతో అతని కాలుపై, ముఖంపై కూడా గాయపరిచింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. కుక్క దాడిలో అతని ముఖం, నోరు, కళ్లు, పెదవులు దెబ్బతిన్నాయి. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే రేబిస్‌ వ్యాక్సిన్‌ కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వ్యాక్సిన్‌ అయిపోయిందని చెప్పారని ఆశిష్‌ తండ్రి విజయ్‌ యాదవ్‌ తెలిపారు. కుక్కల దాడిపై నగరపాలక సంస్థకు సమాచారం అందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోయారు. ఆ పిచ్చి కుక్క దాదాపు గంటలో 17 మందిని గాయపరిచింది.

ఇది కూడా చదవండి: Shiva Raj Kumar: తమిళ దర్శకుడితో శివ రాజ్ కుమార్ సినిమా