Leading News Portal in Telugu

Police Recruitment: ఏకంగా 60,244 పోలీసుల ఉద్యోగాల భర్తీ..


  • ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త.

  • ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
  • 20 శాతం పోస్టుల్లో మహిళా కానిస్టేబుళ్లను కూడా రిక్రూట్.
Police Recruitment: ఏకంగా 60,244 పోలీసుల ఉద్యోగాల భర్తీ..

Police Recruitment: యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో యూపీ పోలీస్‌ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. నోటిఫికేషన్ ప్రకారం 60,244 పోస్టులకు రిక్రూట్మెంట్ ఉంటుంది. ఇది ఇప్పటి వరకు అతిపెద్ద కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్. ఇందులో 20 శాతం పోస్టుల్లో మహిళా కానిస్టేబుళ్లను కూడా రిక్రూట్ చేయనున్నారు. దీనివల్ల మహిళలకు కూడా పెద్ద అవకాశం లభిస్తుంది.

Rain Alert: హైదరాబాద్‌ కు భారీ వర్ష సూచన.. ప్రజలకు జీహెచ్‌ఎంసీ హెచ్చరిక…

డిసెంబర్ 27 నుంచి ఆన్లైన్‌ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని, దరఖాస్తు రుసుము రూ.400గా నిర్ణయించారు. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 16, 2024. అలాగే దరఖాస్తులో ఫీజు సర్దుబాటు, సవరణకు చివరి తేదీ జనవరి 18, 2024. ఇందులో ఈడబ్ల్యూఎస్‌కు 6024, ఓబీసీకి 16264, ఎస్సీలకు 12650, ఎస్టీలకు 1204 పోస్టులు రిజర్వు చేయబడ్డాయి. నోటిఫికేషన్ ప్రకారం 12,049 పోస్టుల్లో మహిళలను నియమించనున్నారు. ఇకపోతే రిక్రూట్‌మెంట్ కోసం మొత్తం పోస్టులలో 20 శాతం మహిళలకు రిజర్వ్ చేయబడింది. దరఖాస్తుదారులు దరఖాస్తు ఫారమ్‌ తో పాటు దరఖాస్తు రుసుమును సమర్పించాలి. జనరల్, ఓబీసీ, షెడ్యూల్డ్ కులాలకు చెందిన పురుష అభ్యర్థుల కనీస ఎత్తు 168 సెం.మీలు, మహిళా అభ్యర్థుల కనిష్ట ఎత్తు 152 సెం.మీ.లు ఉండాలి. షెడ్యూల్డ్ తెగల కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులు కనిష్ట ఎత్తు 160 సెంటీమీటర్లు, మహిళా అభ్యర్థులు కనిష్ట ఎత్తు 147 సెంటీమీటర్లు కలిగి ఉండటం తప్పనిసరి. ఎంపిక కావడానికి అభ్యర్థులు ఆఫ్‌లైన్ రాత పరీక్షకు హాజరు కావాలి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను శారీరక పరీక్షకు పిలుస్తారు. పురుషులు 25 నిమిషాల్లో 4.8 కిలోమీటర్లు, మహిళలు 14 నిమిషాల్లో 2.4 కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంటుంది.

MLC Kavitha: నేడు సుప్రీం కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..

ఈ పోస్టులకు, 12వ తరగతి ఉత్తీర్ణత (ఇంటర్ ఉత్తీర్ణత) అర్హతను కోరింది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థుల మార్కులు సమానంగా ఉంటే.. DOEC నుండి O స్థాయి, NCC B సర్టిఫికేట్, టెరిటోరియల్ ఆర్మీలో రెండేళ్ల సర్వీస్ అనుభవం ఉన్న అభ్యర్థులను పరిగణించబడుతుంది. ఇక వయోపరిమితి విషయానికి వస్తే పురుషులకు 18 సంవత్సరాల నుండి 22 సంవత్సరాలు. మహిళలకు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు. SC, ST, OBC కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయస్సులో 5 సంవత్సరాల సడలింపు ఇవ్వబడుతుంది. వయస్సు 1 జూలై 2023 నుండి లెక్కించబడుతుంది. అంటే, అటువంటి పురుష అభ్యర్థులు 2 జూలై 2001కి ముందు నుండి 1 జూలై 2005 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 2 జూలై 1998 నుండి 1 జూలై 2005 ముందు జన్మించిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.