- ఇండిగో ఎయిర్‌లైన్స్ టిక్కెట్లలో చాలా విచిత్రమైన ఛార్జీలు
- విమాన ప్రయాణ టిక్కెట్లపై ‘క్యూట్ ఛార్జ్’
- నెట్టింట చర్చ
- స్పందించిన ఇండిగో ఎయిర్‌లైన్స్

విమాన ప్రయాణ టిక్కెట్లపై ‘క్యూట్ ఛార్జ్’ ఉంటుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? తాజాగా ఓ ప్రయాణికుడి విషయంలో అలాంటిదే జరిగింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ టిక్కెట్లలో చాలా విచిత్రమైన ఛార్జీలను గమనించిన ప్రయాణికుడు.. వాటికి సంబంధించి టికెట్ ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ప్రయాణికుడు చేసిన పోస్ట్ నెట్టింట చర్చకు దారితీసింది. అందులో టికెట్ ఛార్జీలతో పాటు క్యూట్ ఫీజు, యూజర్ డెవలప్మెంట్ ఫీజు అంటూ ఇతరత్రా ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ శ్రేయాన్ష్సింగ్ అనే వ్యక్తి నెట్టింట పోస్ట్ చేశారు. విమాన టికెట్ ధరకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేస్తూ.. సంస్థను ప్రశ్నించారు.
READ MORE: Minister Parthasarathy: వంద రోజుల్లో 1.20 లక్షల ఇళ్ల నిర్మాణమే మా లక్ష్యం!
ప్రయాణికుడు శ్రేయాన్ష్ చేసిన పోస్ట్‌లో.. టికెట్ ధరతో పాటు క్యూట్ ఛార్జ్ కింద రూ.50 వసూలు చేశారు. ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు కింద రూ.236, యూజర్ డెవలప్మెంట్ ఫీజు కింద రూ.1,003 ఇండిగో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏంటీ క్యూట్ ఫీజు? అంటూ పోస్టులో శ్నేయాన్ష్ ఫైర్ అయ్యారు. యూజర్లు అందంగా ఉన్నారని దీన్ని వసూలు చేస్తున్నారా? మీ విమానాలేమైనా క్యూట్ గా ఉన్నాయని వసూలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. “యూజర్ డెవలప్మెంట్ ఫీజు సంగతేంటి? మీ విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నన్ను ఎలా డెవలప్ చేస్తారు? ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు ఎందుకు? ప్రయాణాల్లో నా భద్రత కోసం ప్రభుత్వానికి నేను పన్నులు కట్టట్లేదా? విమానాల్లో భద్రత కోసం పౌరవిమానయాన శాఖ ఔట్సోర్సింగ్ ఏమైనా ఇచ్చిందా?’’ అని ఫైర్ అయ్యాడు. సోమవారం సాయంత్రం చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
READ MORE:Samantha: ఆ స్పెషల్ విషయం చెప్పేసిన సమంత.. ఏంటంటే?
దీనిపై ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. ఈ ఛార్జీలు ఎందుకో వివరణ ఇచ్చింది. క్యూట్ అంటే కామన్ యూజర్ టర్మినల్ ఎక్విప్మెంట్ ఛార్జ్ అని స్పష్టం చేసింది. సాధారణంగా ఎయిర్‌పోర్టుల్లో మెటల్ డిటెక్టింగ్ మెషిన్లు, ఎస్కలేటర్లు, ఇతర పరికరాలను ఉపయోగించినందుకు వీటిని వసూలు చేస్తున్నట్లు తెలిపింది. యూజర్ డెవలప్మెంట్ ఫీజు అనేది.. ఎయిర్‌పోర్టులో మెయింటనెన్స్ కోసమని వివరించింది.