- పామును నోటితో కరిచి చంపేసిన చిన్నారి
-
బీహార్లో ఘటన.. చిన్నారి సేఫ్

పామును చూడగానే కొందరు ఆమడం దూరం పారిపోతారు. పామును చూసి అంతగా భయపడుతుంటారు. చిన్న వాళ్ల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఎవరైనా హడలెత్తిపోతారు. అంతెందుకు? ఇంట్లోకి వచ్చే చిన్న చిన్న పురుగులను చూసి కూడా చాలా మంది భయపడుతుంటారు. అలాంటిది స్నేక్ కనిపిస్తే మామూలుగా ఉంటుందా? బెంబేలెత్తిపోరు. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: Crime: యువతి దారుణ హత్య.. రక్తపు మడుగులో మృతదేహం.. వీడియో వైరల్
బీహార్లో ఓ చిన్నారి పామును చంపేశాడు. ముక్కుపచ్చలారని పసి బిడ్డ ఏకంగా పామును నోటితో కరిచి చంపేశాడు. దీంతో ఆ పాము ఇంటి ఆవరణలోనే ప్రాణాలు వదిలింది. అయితే చిన్నారిని పామును చంపేసిన తీరు చూసి కుటుంబ సభ్యులు హడలెత్తిపోయారు. భయాందోళనతో వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్ చికిత్స అందించారు. అనంతరం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపాడు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: భారీ విస్తరణకు హెచ్సీఎల్ సన్నాహాలు.. రాష్ట్రంలో మరో 15 వేల ఉద్యోగాలు
Bihar: Child killed a snake by biting it, family members immediately took the child to a doctor for treatment. Where doctors declared the child healthy🫡
pic.twitter.com/3reJDCKQGD— Ghar Ke Kalesh (@gharkekalesh) August 20, 2024