Kolkata Doctor Rape and Murder Case: జూనియర్ డాక్టర్ పై దాడికి ముందు రెడ్‌లైట్ ఏరియాలకు నిందితుడు..!
- కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో మరో మలుపు..
-
రాత్రి సమయంలో రెండు వ్యభిచార గృహాలను సందర్శించిన నిందితుడు సంజయ్ రాయ్.. -
ఈ కేసులో నిందితుడితో పాటు మాజీ ప్రిన్సిపాల్.. ఎస్ఐ అనుప్ దత్తాను ప్రశ్నిస్తునన్న సీబీఐ..

Kolkata Doctor Rape and Murder Case: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశమంతా సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించి మరొక విషయం వెలుగులోకి వచ్చింది. సంజయ్ రాయ్ బాధితురాలిపై హత్యాచారానికి పాల్పడే ముందు కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్‌కతా పోలీసు వర్గాలు తెలిపాయి. ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి సమయంలో అప్పటికే మద్యం తాగిన రాయ్.. ఆసుపత్రికే చెందిన మరో సివిక్ వాలంటీర్‌తో కలిసి కోల్‌కతాలోని ‘రెడ్ లైట్ ఏరియా’లకు వెళ్లాడని.. వీరిద్దరు కలిసి ఓ ద్విచక్రవాహనాన్ని రెంట్ కు తీసుకొని.. తొలుత సోనాగచికి అర్ధరాత్రి టైంలో వెళ్లారు.. అక్కడ రాయ్ వ్యభిచార గృహం బయట నిలబడగా.. అతడి మిత్రుడు లోపలికి వెళ్లి వచ్చాడు.. ఆ తర్వాత రాత్రి 2 గంటల సమయంలో దక్షిణ కోల్‌కతాలోని మరో వ్యభిచార గృహానికి వెళ్లారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను సంజయ్ రాయ్ వేధింపులకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న అతడు.. ఆమె నగ్న చిత్రాలు కావాలంటూ వేధించాడు.
ఇక, ఉదయం 3.50 గంటల సమయంలో ఆర్‌జీ కార్ ఆసుపత్రికి చేరుకున్న సంజయ్ రాయ్.. తొలుత ఆపరేషన్ థియేటర్ డోర్‌ను పగలగొట్టాడు.. 4.03 గంటల టైంలో ఎమర్జెన్సీ విభాగంలోకి వెళ్లాడు.. అనంతరం మూడో అంతస్తులో ఉన్న సెమినార్ గదిలోకి వెళ్లాగా.. అక్కడే బాధితురాలు గాఢ నిద్రలో ఉండటంతో ఆమెపై సంజయ్ రాయ్ దాడికి పాల్పడ్డాడు అని కోల్‌కతా పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో ఆర్‌జీ కార్ ఆసుపత్రి వెనక వైపు వెళ్లి రాయ్ మద్యం తాగినట్లు పలువురు వెల్లడించారు. ఆ సమయంలో పోర్న్ వీడియోలు చూసినట్లు కూడా చెప్పుకొచ్చారు. మద్యం తాగిన తర్వాత పలుమార్లు ఆసుపత్రి ప్రాంగణంలో చక్కర్లు కొట్టినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.
కాగా, సెమినార్ హాలులో బాధితురాలు చనిపోయిన విషయం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 9న 10.53 నిమిషాలకు బాధితురాలి తల్లికి విషయం తెలిపారు. ఫస్ట్ బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు హస్పటల్ సిబ్బంది చెప్పాగా.. ఆ తర్వాత ఇది హత్యగా తేలింది. బాధితురాలు చనిపోయిన సెమినార్ హాల్‌లోకి నిందితుడు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కోల్‌కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తడంతో కేసును సీబీఐకి అప్పగించారు. తొలుత కేసు నమోదు చేసిన ఎస్సై అనుప్ దత్తాను సీబీఐ ప్రశ్నించింది. ఎస్సైతో కలిసి నిందితుడు సంజయ్ రాయ్ దిగిన పలు ఫొటోలను దర్యాప్తు సంస్థ సేకరించింది.