- బీహార్ లోని హాజీపూర్‌లో వార్డు కౌన్సిలర్ పంకజ్‌రాయ్ పై కాల్పులు.
- బైక్‌పై వచ్చిన దుండగులు వార్డు కౌన్సిలర్ పై కాల్పులు.
- దుకాణం బయట కూర్చున్న సమయంలో దుండగులు వచ్చి కాల్చిచంపారు.

Murder Video: బీహార్ లోని హాజీపూర్‌లో వార్డు కౌన్సిలర్ పంకజ్‌రాయ్ పై కాల్పులు జరిగాయి. సమాచారం మేరకు బైక్‌పై వచ్చిన దుండగులు వార్డు కౌన్సిలర్ పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. పంకజ్ రాయ్ 5వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు. అతను తన దుకాణం బయట కూర్చున్న సమయంలో దుండగులు వచ్చి కాల్చిచంపారు. ఇకపోతే దాడుల నేపథ్యంలో.. అతను ఇంట్లోకి పరిగెత్తాడు. అయితే అతని వెనుకే ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కూడా అతనిని మూడుసార్లు కాల్చి చంపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Bigg Boss Telugu 8: సీన్ రివర్స్.. బిగ్‌బాస్ 8 నుంచి వేణు స్వామి అవుట్! కారణం ఆ హీరోనేనా?
ముగ్గురు దుండగులు మోటార్ సైకిల్ పై వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచి అందిన సమాచారం మేరకు., తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ వార్డు కౌన్సిలర్ హత్యపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో నితీష్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు కొందరు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది పరస్పర శత్రుత్వమేనని భావిస్తున్నారు. పంకజ్‌రాయ్ కు ఒకరితో పాత శత్రుత్వం ఉందని, దీంతో 6 నెలల క్రితం సదర్ పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా., పోలీస్‌స్టేషన్‌లో సరైన చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, పోలీసులు దీనిపై ఇంకా ఏమీ చెప్పలేదు. కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
VIDEO | Bihar: Ward councillor Pankaj Rai shot dead by unidentified miscreants in #Hajipur on Tuesday night. The attack was caught on CCTV.#BiharNews
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/FOSOgp1H2y
— Press Trust of India (@PTI_News) August 21, 2024