Leading News Portal in Telugu

Kolkata doctor case: వీడు మనిషి కాదు జంతువు..! సీబీఐ సైకో ఎనాలసిస్ టెస్ట్లో సంచలన విషయాలు


  • కోల్‌కతా రేప్-హత్య నిందితుడు సంజయ్ రాయ్‌కు మానసిక విశ్లేషణ పరీక్ష

  • అందులో బయటపడ్డ సంచలన విషయాలు

  • సంజయ్‌ది లైంగికంగా వికృతమైన మనస్తత్వం

  • నిందితుడు జంతువులను పోలిన ప్రవృత్తిని కలిగి ఉన్నాడు.
Kolkata doctor case: వీడు మనిషి కాదు జంతువు..! సీబీఐ సైకో ఎనాలసిస్ టెస్ట్లో సంచలన విషయాలు

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఈ కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌పై సీబీఐ మానసిక విశ్లేషణ (Psychoanalysis Test) నిర్వహించగా అందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు సంజయ్‌ది లైంగికంగా వికృతమైన మనస్తత్వం, జంతువులను పోలిన ప్రవృత్తిని కలిగి ఉన్నాడని తేలింది.

మరోవైపు.. నేరం జరిగిన ప్రదేశంలో సంజయ్ రాయ్ ఉన్నట్లు సాంకేతిక, శాస్త్రీయ ఆధారాల ద్వారా ధృవీకరించబడినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. సీబీఐ ఈ కేసును హ్యాండవర్ చేసుకునే ముందు.. కోల్‌కతా పోలీసులు అత్యాచార బాధితురాలి గోళ్ల కింద కనిపించిన రక్తం, చర్మంపై ఉన్న గుర్తులు సంజయ్ రాయ్ చేతులపై ఉన్న గాయాలతో సరిపోలుతున్నాయని చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు స్టేటస్ రిపోర్టును సీబీఐ గురువారంలోగా సుప్రీంకోర్టుకు సమర్పించింది.

కోల్‌కతా ఘటనపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ క్రమంలో.. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం మరియు హత్యకు సంబంధించి కోల్‌కతా పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేయడంలో జాప్యం చేయడం చాలా ఆందోళనకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా.. ఈ ఘటనపై నిరసన తెలిపిన వైద్యులను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు కోరింది. వారు తిరిగి విధుల్లో చేరిన తర్వాత వారిపై ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోబోమని వారికి హామీ ఇచ్చింది. CJI DY చంద్రచూడ్, జస్టిస్ J.B. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టారు. అసహజ కేసుకు ముందు కూడా మరణించిన బాధితురాలి పోస్ట్‌మార్టం ఆగస్టు 9 సాయంత్రం 6 గంటలకు నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని ధర్మాసనం పేర్కొంది.