Leading News Portal in Telugu

National Space Day: తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ శుభాకాంక్షలు..


  • భారతదేశం నేడు (ఆగస్టు 23) జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
  • మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం.
  • తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్.
National Space Day: తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ శుభాకాంక్షలు..

National Space Day: భారతదేశం నేడు (ఆగస్టు 23) జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇది దేశం యొక్క మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం. ఇక ఈ ఏడాది నుండి ప్రతి సంవత్సరం చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన వార్షికోత్సవం సందర్భంగా జరుపుకుంటారు. తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ లో పోస్ట్ చేయడం ద్వారా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ని ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైంది.

Viral Video Today: ఆరు ప్రయత్నించి ఏడోసారి వదిలేశాడు.. క్యాచ్‌ను భలే వదిలేశావ్ భయ్యో!

ప్రధాని మోడీ ఈ విషయాన్నీ అభినందిస్తూ, తన ఎక్స్ పోస్ట్‌ లో, మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అంతరిక్ష రంగంలో మన దేశం సాధించిన విజయాలను ఎంతో గర్వంగా గుర్తు చేసుకుంటున్నాం. మన అంతరిక్ష శాస్త్రవేత్తల సహకారాన్ని అభినందించాల్సిన రోజు కూడా.. మా ప్రభుత్వం ఈ రంగానికి సంబంధించి అనేక భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంది. ఇంకా రాబోయే కాలంలో మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని పోస్ట్‌ లో ఆయన రాశారు.