Leading News Portal in Telugu

TPCC Chief Post: తెలంగాణ పీసీసీ చీఫ్పై ఢిల్లీలో కసరత్తు..


  • తెలంగాణ పీసీసీ చీఫ్ పై ఢిల్లీలో కసరత్తు..

  • సమావేశానికి హాజరైన సోనియా గాంధీ.. ఖర్గే.. రేవంత్.. రాహుల్.. భట్టి..

  • టీపీసీసీ చీఫ్ నియామకం.. కేబినెట్ విస్తరణపై చర్చ..
TPCC Chief Post: తెలంగాణ పీసీసీ చీఫ్పై ఢిల్లీలో కసరత్తు..

TPCC Chief Post: ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతుంది. ఈ మీటింగ్ లో తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడు నియామకం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ పాల్గొన్నారు.

కాగా, ఈ సమావేశంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలో ఎస్సీ, ఎస్టీ, బీపీల వర్గలకు ఈ పదవి ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. అందులో బీసీలకు ఇవ్వాల్సి వస్తే.. పరిశీలనలో మహేష్ గౌడ్, మధు యాష్కీ పేర్లు ఉన్నాయి.. ఎస్సీ కోటాలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేరు పరిశీలన ఉండగా.. ఎస్టీ కోటాలో ఎంపీ బలరాం నాయక్ పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే, పీసీసీ నియామకంపై ఇప్పటికే రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంది.