- కోల్‌కతా రేప్ ఘటన నిందితుడు తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
-
తన కుమారుడు ఎవరికి హాని చేయడు- నిందితుడు తల్లి -
ఎవరో తన కొడుకును ఇరికించారు.. -
అతనిని కఠినంగా శిక్షించాలని అంటున్న రాయ్ తల్లి.

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సంజయ్ రాయ్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కుమారుడు ఎవరికి హాని చేయడని చెప్పింది. ఎవరో తన కొడుకును ఇరికించారని.. అతనిని కఠినంగా శిక్షించాలని రాయ్ తల్లి డిమాండ్ చేసింది. ‘తన తండ్రి చాలా కఠినంగా ఉండేవాడు. నేను కఠినంగా ఉంటే ఇలా జరిగేది కాదు. తన తండ్రిని నా కొడుకు గౌరవించేవాడు.” అని ఆమె చెప్పింది.
Kejriwal: కేజ్రీవాల్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతి
అంతేకాకుండా.. రాయ్ తల్లి మాట్లాడుతూ, సంజయ్ రాయ్కి క్రీడలపై ఆసక్తి ఉండేదని.. అతను బాక్సింగ్ నేర్చుకునేవాడని తెలిపింది. రాయ్.. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో, పాఠశాలలో టాపర్ అని చెప్పింది. తన కొడుకు తనను జాగ్రత్తగా చూసుకునేవాడని, తనకు వంట కూడా చేసేవాడని తెలిపింది. కావాలంటే.. తమ ఇంటి ఇరుగుపొరుగు వారిని అడగవచ్చు.. అతను ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించడని ఆమె చెప్పింది. తాను తన కొడుకును కలిస్తే.. ‘బాబూ ఎందుకు ఇలా చేశావు?’ అని అడిగేదానినని.. తన కొడుకు ఎప్పుడూ ఇలా చేయడని ఆమె చెప్పింది.
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కదిలించిన మహిళా సర్పంచ్.. ఎవరీ కారుమంచి సంయుక్త?
మరో ఆసక్తికర విషయమేంటంటే..? RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో తన కొడుకు వాలంటీర్‌గా పని చేస్తున్నట్లు ఆమెకు తెలియదని చెప్పింది. తన కొడుకు RG కర్ హాస్పిటల్‌కి వెళ్తాడని తనకు తెలియదని.. ఆ రోజు రాత్రి అతను భోజనం కూడా చేయలేదని తెలిపింది. అంతేకాకుండా.. తన కుమారుడు ‘రెడ్ లైట్ ఏరియా’ సందర్శించేవాడని వచ్చిన వార్తలను నిందితుడు తల్లి ఖండించింది. మొదటి భార్య క్యాన్సర్‌తో చనిపోవడంతో రాయ్ మద్యానికి బానిసయ్యాడని అతని తల్లి చెప్పింది. సంజయ్ మొదటి భార్య మంచి అమ్మాయి.. వారు సంతోషంగా ఉండేవారని చెప్పింది. ఆమెకు అకస్మాత్తుగా క్యాన్సర్ వచ్చి చనిపోవడంతో తన కొడుకు నిరాశకు గురయ్యాడని.. ఈ క్రమంలో మద్యపానం చేసేవాడని చెప్పింది. ఇదిలా ఉంటే.. రాయ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తల్లి చెప్పింది.