- ప్రముఖ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ భర్త హఠాన్మరణం
-
ఇన్షా ఘై కల్రా భావోద్వేగ పోస్టు

ప్రముఖ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్షా ఘై కల్రా భర్త అంకిత్ కల్రా ఆకస్మిక మరణానికి గురయ్యారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసి అభిమానులను షాక్‌కు గురిచేసింది. అంకిత్ కల్రా వయసు 29. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్వేగభరితమైన పోస్ట్‌లో హృదయపూర్వక సందేశంతో అంకిత్ చిత్రాన్ని పంచుకున్నారు. ‘‘నన్ను ఒక రోజు వెనక్కి తీసుకెళ్లండి. నేను పనులను భిన్నంగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాను! తిరిగి రండి బేబీ, దయచేసి? నేను నిన్ను కోల్పోతున్నాను.’’ అంటూ ఇన్షా రాసుకొచ్చింది. ఇన్ఫ్లుయెన్సర్ ఆగస్ట్ 20న ఇన్‌స్టాగ్రామ్‌లో విషాద వార్తను పంచుకున్నారు. అభిమానులు, అనుచరులు షాక్ గురయ్యారు. హృదయ విదారకంగా ఉందని బదులిచ్చారు. ఇదిలా ఉంటే అంకిత్ మృతికి గల కారణాలను పోస్ట్ వెల్లడించలేదు. ఇన్షా ఘై కల్రా మరియు అంకిత్ కల్రా ఫిబ్రవరి 2023లో వివాహం చేసుకున్నారు.
ఇన్షా-అంకిత్ కల్రా సహ యజమానిగా ‘‘హౌస్ ఆఫ్ స్టైల్స్, బై స్మృతి & ఇన్షా’’ అనే పేరుతో దుస్తుల బిజినెస్‌ను కలిగి ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న ఈ జంట.. రీల్స్ మరియు చిత్రాల ద్వారా ఫేమస్ అయ్యారు. ఇన్షా ఘై కల్రా ఇన్‌స్టాగ్రామ్‌లో 7,28,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ పేరు గడించారు. ఆమె తన భర్తతో కలిసి హాస్యభరితమైన ఇన్స్టాగ్రామ్ రీల్స్‌కు ప్రసిద్ది చెందింది.
అంకిత్… ఢిల్లీకి చెందిన డిజిటల్ సృష్టికర్త. ఇంటీరియర్ డిజైనర్ మరియు బిల్డర్. ఇన్షాతో కలిసి ఫన్నీ రీల్స్‌లో తరచుగా కనిపించాడు. అతని చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అతని మరణానికి ఒక రోజు ముందు ఆగస్టు 18న కనిపించింది. నల్లటి టీ షర్ట్, సన్ గ్లాసెస్‌లో తన చిత్రాన్ని పంచుకున్నాడు. ఆగస్టు 4న అతని భార్యతో కలిసి అతని చివరి ఇన్స్టాగ్రామ్ రీల్‌కు ‘‘ఆధునిక సమస్యలకు ఆధునిక పరిష్కారాలు అవసరం’’ అనే శీర్షిక పెట్టారు. ఇక అంకిత మృతి పట్ల నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందో అర్థం కాక సతమతం అవుతున్నారు.