- భారత ఆర్మీ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న పాక్ సైన్యం
- సాంకేతిక లోపం కారణంగా నియంత్రణ రేఖ దాటిన వైనం
- ఈరోజు ఉదయం ఘటన

భారత ఆర్మీ డ్రోన్‌ను పాక్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ డ్రోన్ నిఘా డ్యూటీలో ఉంది. సాంకేతిక లోపం కారణంగా.. నియంత్రణ రేఖను దాటింది. ఈ సంఘటన ఈరోజు అంటే 23 ఆగస్టు 2024 ఉదయం 9.30 గంటలకు జరిగింది. భారత సైన్యానికి చెందిన టాక్టికల్ యూఏవీ అంటే స్విచ్ డ్రోన్ నియంత్రణ రేఖ దాటి పాకిస్థాన్‌లో పడిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డ్రోన్ అనుకోకుండా సరిహద్దు దాటింది. ఈ ఘటన రాజౌరీ సెక్టార్‌లో చోటుచేసుకుంది.
READ MORE: Raviteja: హీరో రవితేజకు గాయం..శస్త్ర చికిత్స
కాగా.. పాక్ ఆర్మీ డ్రోన్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ డ్రోన్ సాధారణ నిఘా డ్యూటీలో ఉండగా.. ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) స్థాయిలో చర్చలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ డ్రోన్ పాకిస్తాన్ సరిహద్దులోని నికియాల్ సెక్టార్‌లో, భీంభర్ గలీ సెక్టార్‌కి అవతలి వైపు పడిపోయింది. ఇందులో కొంత సాంకేతిక సమస్య తలెత్తిందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. .
READ MORE: Modi-Zelenskyy: మోడీ- జెలెన్స్కీ పక్కనున్న మహిళ ఎవరో తెలుసా?.. ఎందుకు అంత దగ్గరగా ఉంది?
ఇప్పటి వరకు పాకిస్థాన్ ఎన్ని భారత డ్రోన్‌లను స్వాధీనం చేసుకుంది అనే దానిపై సమాచారం లేదు. అయితే ఇలాంటి కేసు ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఈ డ్రోన్‌లో ఎలాంటి ఆయుధం అమర్చబడలేదు. ఇది కేవలం నిఘా డ్రోన్ మాత్రమే. దాదాపు ఏడు కిలోల బరువు ఉంటుంది. ఇది ఒక గంట పాటు ఎగరగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులో పగలు, రాత్రి వేళల్లో నిఘా కోసం హెచ్‌డీ కెమెరాను అమర్చారు.