- తండ్రిని హత్య చేసిన 16 ఏళ్ల బాలుడు..
-
తల్లిని కొడుతున్నాడని హత్య..

Crime: ఆవేశంతో 16 ఏళ్ల బాలుడు తన తండ్రిని హత్య చేసిన ఘటన ఢిల్లీలోని రోహిణిలో జరిగింది. తండ్రిని హత్య చేసినందుకు బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం పోలీసులు వెల్లడించారు. బాలుడు తన తండ్రి తలపై ప్లాస్టిక్ పైపుతో కొట్టడంతో మరణించాడని పోలీసులు తెలిపారు.
ఆదివారం ఉదయం అమన్ విగర్ పోలీస్ స్టేషన్‌కి ఒక వ్యక్తి హత్య గురించి ఫోన్ కాల్ వచ్చిందని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించామని చెప్పారు. మృతుడు తన భార్యతో గొడవపడుతున్న సమయంలో అతని కుమారుడు జోక్యం చేసుకుని తలపై ప్లాస్టిక్ పైపుతో కొట్టాడని, అది అతని మరణానికి దారి తీసిందని అధికారి వెల్లడించారు. హత్య చేయబడిని వ్యక్తి తరుచూ మద్యం మత్తులో భార్య, పిల్లలను కొట్టేవాడని ప్రాథమిక విచారణలో తేలింది.