Leading News Portal in Telugu

Kolkata Doctor Murder: సచివాలయం ముట్టడికి జూనియర్‌ వైద్యులు మద్దతు ఎందుకు ఇవ్వలేదు?


  • కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం
  • దేశ వ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు
  • నేడు రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు
  • కానీ ఈ ముట్టడికి జూనియర్ వైద్యులు మద్దతు ఇవ్వాలేదు.. ఎందుకంటే ?
Kolkata Doctor Murder: సచివాలయం ముట్టడికి జూనియర్‌ వైద్యులు మద్దతు ఎందుకు ఇవ్వలేదు?

కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసుపై దేశ వ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న వేళ కోల్ కతా అట్టుడికి పోతుంది. విద్యార్థులు మరోసారి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. విద్యార్థులు ఇప్పటికే ‘నబన్న అభియాన్’ కింద.. అంటే సెక్రటేరియట్ ముట్టడించారు. దీన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. హౌరా బ్రిడ్జికి సీలు వేసింది. బ్రిడ్జిపై ఇనుప గోడను నిర్మించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

READ MORE: Advocate Mohit Rao: ఈడీ కేసుపై కవిత న్యాయవాది కీలక వ్యాఖ్యలు..

కాగా.. ఈ నిరసన చేస్తున్న విద్యార్థి సంఘం పేరు.. పశ్చిమబంగ ఛాత్ర సమాజ్‌.. ఈ సంఘం ఎలాంటి రికార్డుల్లో నమోదవ్వలేదు. గత కొన్నివారాల కింద దీన్ని ప్రారంభించారు. ఇక్కడి రవీంద్ర భారతి యూనివర్సిటీ మాస్టర్స్‌ విద్యార్థి ప్రబీర్‌ దాస్‌, కల్యాణీ యూనివర్సిటీకి చెందిన శుభాంకర్‌ హల్దార్‌, రవీంద్ర ముక్త యూనివర్సిటీ విద్యార్థి సయన్‌ లాహిరి కలిసి ‘నబన్నా అభియాన్’ ముట్టడికి పిలుపునిచ్చారు. పైన పేర్కొన్న విద్యార్థులు ఈ నిరసనలకు నేతృత్వం వహిస్తున్నారు. ఎలాంటి రాజకీయ పార్టీతో తమకు సంబంధం లేదని, కేవలం న్యాయం కోసం మాత్రమే తాము ఈ ఆందోళనకు పిలుపునిచ్చామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మూడు డిమాండ్లను వినిపించారు. బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితుడికి మరణశిక్ష విధించాలని, సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

READ MORE: Mallikarjun Kharge: చిక్కుల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే.. బెంగళూర్ ఏరోస్పేస్ పార్కులో 5 ఎకరాల భూమి..

ఈ ఘటనలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే .. హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్‌ వైద్యులు.. ఈ నిరసనలకు దూరంగా ఉన్నారు. ఛాత్ర సమాజ్‌ తో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించిన జూనియర్‌ వైద్యులు ప్రకటించారు. బుధవారం కోల్‌కతాలో ర్యాలీకి పిలుపునిచ్చారు. మరోవైపు, ఈ విద్యార్థి సంఘం ఆందోళనలకు భాజపా మాత్రమే మద్దతు ఇచ్చింది.వేరే విద్యార్థి సంఘాలు కూడా దూరంగా ఉన్నాయి. దీనిపై ప్రస్తుతం నెట్టింట చర్చ నడుస్తోంది.!