- 12 కొత్త స్మార్ట్ సిటీలు..10 లక్షల మందికి ఉద్యోగాలు..
-
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం..

Cabinet Decisions: దేశవ్యాప్తంగా కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వీటి ద్వారా 10 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేబినెట్ సమావేశం తర్వాత మాట్లాడిన ఆయన.. ‘‘నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు క్యాబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ. 28,602 కోట్లు పెట్టుబడి పెడుతుంది.’’ అని చెప్పారు.