- రుతుక్రమ నొప్పుల ఉపశమనం కోసం మాత్రలు..
-
డోస్ ఎక్కువ కావడంతో మరణించిన 18 ఏళ్ల యువతి.. -
తమిళనాడు తిరుచ్చిలో ఘటన..

Menstrual Cramps: రుతుక్రమ నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఓ యువతి ట్యాబ్లెట్లు వేసుకోవడం ఆమె ప్రాణాలను తీసింది. ఈ ఘటన తమిళనాడు లోని తిరుచ్చి జిల్లాలో జరిగింది. ముసిరి తాలూకా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి రుతుక్రమంలో నొప్పి నివారణకు మెడిసిన్స్ తీసుకుంది. తీవ్రమైన కడుపు నొప్పిని తగ్గించే ప్రయత్నంలో ఎక్కువ ట్యాబ్లెట్లను వేసుకుంది. ఇది ఆమె ప్రాణాలనపు తీసింది. ఈ విషాద ఘటన ఆగస్టు 21న తిరుచ్చిలోని పులివలం ప్రాంతంలో చోటు చేసుకుంది.
READ ALSO: Rahul Gandhi: త్వరలో భారత్ జోడో యాత్ర!.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
మందులు వేసుకున్న వెంంటనే ఆమె వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. వెంటనే తల్లిదండ్రులు గమనించి ఆమెను ఓమందూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఆమె ఇంటికి వచ్చి తర్వాత స్పృహ కోల్పోవడంతో మరోసారి యువతి పేరెంట్స్ ఆమెను తదుపరి చికిత్స కోసం మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రి (MGMGH)లో చేర్చారు. చికిత్స తీసుకున్నప్పటికీ, అధిక మోతాదులో మందులు తీసుకోవడంతో ఆమె మరణించింది. హై డోస్ మందులు వాడటం వల్లే ఆమె మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. యువతి ఇంజనీరింగ్ చదివేందుకు అడ్మిషన్ కౌన్సిలింగ్ కోసం ఎదురుచూస్తోంది.
ఇదిలా ఉంటే, ఇదే తరహాలో తిరుచ్చికి చెందిన 34 ఏళ్ల నలుగురు పిల్లల తల్లి కూడా ఆగస్టు 24న మరణించింది. అబార్షన్ మాత్రలు తీసుకున్న తర్వాత ఆమె ఆరోగ్యం విషమించి, చనిపోయింది. గర్భవతి అయిన మహిళ వైద్యుడిని సంప్రదించకుండా అబార్షన్ పిల్స్ వేసుకుంది. సమస్య తీవ్రం కావడంతో ఆమెని MGMGHకి తరలించారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆమె మరణించారు.