Leading News Portal in Telugu

Gujarat Floods: వరదల్లో కొట్టుకొచ్చిన మొసళ్లు.. వీడియో వైరల్


  • గుజరాత్‌ను ముంచెత్తిన వరదలు

  • జనావాసాల్లోకి కొట్టుకొచ్చిన మొసళ్లు
Gujarat Floods: వరదల్లో కొట్టుకొచ్చిన మొసళ్లు.. వీడియో వైరల్

గుజరాత్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. ఊళ్లు.. చెరువులు ఏకమైపోయాయి. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలే నీట మునిగిపోయాయి. కార్లు, బైకులు, వస్తువులు అన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. ఇక ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అంతగా వరదలు బీభత్సం సృష్టించాయి. ఇక ఈ వరదల్లో మూగజీవాలు జనావాసాల్లోకి వచ్చేశాయి. మొసళ్లు ఇళ్లల్లోకి కొట్టుకొచ్చాయి. దీంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Railway Station Collapses: మిజోరంలో కొండచరియలు విరిగిపడి కుప్పకూలిన రైల్వే స్టేషన్

రాష్ట్రంలో నదులు, డ్యామ్‌లు నిండుకుండల్లా తలపిస్తున్నాయి. పలు నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో మొసళ్లు గ్రామాల్లోకి కొట్టుకొచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో వడోదర జిల్లాలోని విశ్వామిత్ర నది నుంచి భారీగా మొసళ్లు జనావాసాల్లోకి వచ్చాయి. వడోదరలోని మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ క్యాంపస్‌లోని జువాలజీ విభాగానికి సమీపంలో 11 అడుగుల మొసలిని స్థానికులు గుర్తించారు. మొసలిని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు… స్థానికుల సాయంతో మొసలిని సురక్షితంగా బంధించారు. వడోదరలోని అకోటా ప్రాంతంలో కూడా ఓ మొసలి ఇంటి పైకప్పు ఎక్కిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. వడోదరకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదిలోంచి మొసళ్లు వచ్చినట్లుగా అధికారులు గుర్తిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Kangana Ranaut: “అత్యాచారాలను చిన్నచూపు చూడటం సర్వసాధారణమైంది”