- ఆగస్టు నెలలో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ గణనీయంగా తగ్గింది..
-
ఆగస్టు 2న రూ. 2. 86 లక్షల కోట్లు ఉండగా.. 16వ తేదీ వరకు 0.95 లక్షల కోట్లు తగ్గింది.. -
బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి: ఆర్థికమంత్రి

Banking Liquidity: ఆగస్టు నెలలో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ గణనీయంగా తగ్గి పోయిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో (ఆగస్టు 2న) బ్యాంకింగ్ లిక్విడిటీ 2. 86 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇది ఆగస్టు 16వ తేదీ నాటికి 1.55 లక్షల కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. ఆగస్టు 28వ తేదీ నాటికి లిక్విడిటీ రూ.0.95 లక్షల కోట్లకు తగ్గింది. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ బ్యాంకులకు పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ.. బ్యాంకింగ్ లిక్విడిటీలో ఈ క్షీణత ఇప్పటికి కొనసాగుతోంది.
కాగా, ఒకప్పుడు బ్యాంకులపై ఆధారపడే వ్యక్తులు ఎక్కువగా క్యాపిటల్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు, ఇతర ఆర్థిక కార్యకలాపాలపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని.. దీనివల్ల బ్యాంకు డిపాజిట్లలో వీరి వాటా గణనీయంగా తగ్గుతోందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. ఆగస్టు 10వ తేదీన భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. బ్యాంకులు తమ ప్రధాన వ్యాపారమైన డిపాజిట్లు, రుణాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని, డిపాజిట్లను పెంచడానికి వినూత్న పథకాలతో ముందుకు రావాలని కోరారు.