Leading News Portal in Telugu

Mohanlal: లైంగిక వేధింపులపై హేమా కమిటీ రిపోర్టుని స్వాగతించిన మోహన్ లాల్..


  • లైంగిక వేధింపులపై హేమా కమిటీ రిపోర్టుని స్వాగతించిన మోహన్ లాల్..
Mohanlal: లైంగిక వేధింపులపై హేమా కమిటీ రిపోర్టుని స్వాగతించిన మోహన్ లాల్..

Mohanlal: మలయాళ ఫిలిం ఇండస్ట్రీ ‘‘మాలీవుడ్’’లో హేమా కమిటి రిపోర్టు సంచలనంగా మారింది. కేరళ ఫిలిం ఇండస్ట్రీలో మహిళా నటులపై లైంగిక వేధింపులు, అడ్వాన్సులు, కమిట్‌మెంట్ వంటి అంశాలను ఈ నివేదిక వెలుగులోకి తెచ్చింది. ఈ నివేదిక వచ్చిన తర్వాత పలువరు స్టార్ యాక్టర్లపై మహిళా నటీమణులు, హీరోయిన్ల సంచలన ఆరోపణలు చేశారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో స్టార్ యాక్టర్ జయసూర్యతో పాటు ఎం ముఖేష్ వంటి వారు ఉన్నారు. మాలీవుడ్‌లో జరుగుతున్న భయంకరమైన లైంగిక వేధింపుల గురించి ప్రస్తుతం పెద్ద చర్చనే నడుస్తోంది.

ఇదిలా ఉంటే, తాజాగా హేమా కమిటీ నివేదికను మలయాళ స్టార్ హీరో, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ స్వాగతించారు. వరసగా మలయాళ నటులపై వస్తున్న లైంగిక ఆరోపణలతో ఇండస్ట్రీ టాప్ బాడీ అయిన అసోసియేషన్ ఆఫ్ మలమాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ)ని రద్దు చేస్తూ, దాని చీఫ్ అయిన మోహన్ లాల్ నిర్ణయం తీసుకున్నారు.