- ఢిల్లీలో దారుణం..
-
5 ఏళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడి అత్యాచారం..

Delhi Crime: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 5 ఏళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నైరుతి ఢిల్లీలో ఈ ఘటన జరిగినట్లు పోలీస్ అధికారి శనివారం తెలిపారు. కూలి పని చేసే బాలిక తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం పంపించారు.
గురువారం బాలిక తల్లిదండ్రులు కూలీ కోసం బయటకు వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. భారతీయ న్యాయ సంహిత, పోక్సో చట్టం సెక్షన్ 65 (2) (మైనర్‌పై అత్యాచారం) కింద కేసు నమోదు చేయబడింది. బాలుడిని పట్టుకుని అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడైన బాలుడు, బాలిక పొరుగు ఇంటిలోనే ఉంటున్నాడని, బాలిక తండ్రి స్నేహితుడి కొడుకు అని పోలీసులు తెలిపారు. కేసుని తదపరి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.