Leading News Portal in Telugu

Maharashtra: బీఫ్ మటన్ తీసుకెళ్తున్నాడని.. రైలులో వృద్ధుడిపై యువకులు దాడి


  • బీఫ్ మటన్ తీసుకెళ్తున్నాడని రైలులో వృద్ధుడిపై యువకులు దాడి

  • మహారాష్ట్ర నాసిక్‌లోని ఇగత్‌పురి సమీపంలో ఘటన

  • దాడికి సంబంధించిన వీడియో వైరల్.
Maharashtra: బీఫ్ మటన్ తీసుకెళ్తున్నాడని.. రైలులో వృద్ధుడిపై యువకులు దాడి

రైలులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడిపై కొందరు యువకులు చితకబాదారు. ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్‌లోని ఇగత్‌పురి సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వృద్ధుడు రైలులో ప్రయాణిస్తుండగా.., అతను బీఫ్ మటన్ తీసుకెళుతున్నాడనే అనుమానంతో కొందరు యువకులు దాడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. ఆ వీడియోలో నలుగురు యువకులు అతనికి ఎదురుగా కూర్చొని బెదిరిస్తున్నారు. గట్టిగా అరుస్తూ.. కాలుతో తన్నేందుకు ప్రయత్నించారు. ఆ వృద్ధుడు మాత్రం భయపడుతూ సంచిలో ఉన్న డబ్బాలు తీస్తున్నాడు. మరో ఇద్దరు నిలబడి ఉన్న యువకులు అతనిపై దాడి చేశారు. డబ్బాల్లో ఏంటని ప్రశ్నిస్తూ అతన్ని కొడుతున్నారు. అయితే.. రెండు డబ్బాల్లో మాత్రం ఏవో మాంసం ముక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆ వృద్ధుడిని చితకబాదుతూ యువకులు కెమెరాల్లో వీడియోను రికార్డ్ చేశారు.

ఈ ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ విషయంపై జీఆర్పీ అధికారులు దర్యాప్తు ప్రారంభించింది. జీఆర్‌పి తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు హాజీ అష్రఫ్ మున్యార్, జల్గావ్ జిల్లా వాసి. అతను కళ్యాణ్‌లోని తన కుమార్తె ఇంటికి వెళుతున్నాడు. బీఫ్ మటన్ తీసుకెళ్తున్నాడనే అనుమానంతో బాధితురాడిపై ఇగత్‌పురి సమీపంలో రైలులోని ఇతర ప్రయాణికులు దాడి చేశారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి చర్యలు తీసుకుంటామని, దాడిలో పాల్గొన్న కొంతమందిని గుర్తించామని జీఆర్పీ అధికారులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.