Leading News Portal in Telugu

AICC: ఏఐసీసీ కొత్త కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో మల్లికార్జున ఖర్గే, రాహుల్ భేటీ..!


  • ఏఐసీసీ నూతన కార్యదర్శులు
  • సంయుక్త కార్యదర్శులతో ఖర్గే
  • రాహుల్ భేటీ..

  • కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే అంశాలపై దీర్ఘంగా చర్చ..

  • పదవీ విరమణ చేసిన కార్యదర్శులు
  • సంయుక్త కార్యదర్శుల సహకారాన్ని అభినందించిన ఖర్గే..
AICC: ఏఐసీసీ కొత్త కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో మల్లికార్జున ఖర్గే, రాహుల్ భేటీ..!

AICC: ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జ్‌ను ఖర్గే, రాహూల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ రోజు (మంగళవారం) న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో పార్టీ నూతన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగతాన్ని బలోపేతం చేసే అంశాలపై దీర్ఘంగా చర్చించారు. ఆగస్టు 30వ తేదీన పార్టీని పునర్ వ్యవవస్థీకరించడంలో భాగంగానే అనేక రాష్ట్రాలు, పార్టీ విభాగాలలో పలువురు కొత్త కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించింది. ఈ నేపథ్యంలో వారందరితో భేటీ అయిన అగ్రనాయకత్వం పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఇతర అంశాలపై డిస్కస్ చేశారు. ఇక, పదవీ విరమణ చేసిన ఏఐసీసీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల సహకారాన్ని మల్లికార్జున ఖర్గే అభినందించారు.

కాగా, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు ఏఐసీసీ కార్యదర్శులుగా నెట్టా డిసౌజా, నీరజ్ కుందన్, నవీన్ శర్మలు కొనసాగుతున్నారు. పురవ్ ఝా, గౌరవ్ పాంధీలను కాంగ్రెస్ అధ్యక్షుడి ఆఫీసులో సమన్వయకర్తలుగా విధులు నిర్వహిస్తున్నారు. వినీత్ పునియా, రుచిరా చతుర్వేది పార్టీ కమ్యూనికేషన్ విభాగంలో కార్యదర్శులుగా ఎంపికయ్యారు. ఆరతి కృష్ణ పార్టీ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా వర్క్ చేయనున్నారు. హర్యానాకు మనోజ్ చౌహాన్, ప్రఫుల్ల వినోదరావు గుడాధే, బీహార్‌కు దేవేంద్ర యాదవ్, సుశీల్ కుమార్ పాసి, షానవాజ్ ఆలం కార్యదర్శులుగా ఎంపికయ్యారు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లకు సెక్రటరీలుగా డానిష్ అబ్రార్, దివ్య మదెర్నాతో పాటు ఇంకా పలు రాష్టాలకు కార్యదర్శులను కొత్త వారిని కాంగ్రెస్ నియమించింది.