- జూనియర్ డాక్టర్ హత్య కేసులో బెంగాల్ సర్కార్ పరువు తీస్తుంది బీజేపీ..
-
మహిళలపై నేరాల విషయంలో ఉత్తర ప్రదేశ్ ముందువరసలో ఉంది.. -
ప్రజల ప్రాణాల పట్ల యోగి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు: అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యచారా, హత్య ఘటనలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రయత్నిస్తోందని సమాజ్ వాది చీఫ్, కన్నౌజ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. అఖిలేష్ ఈరోజు (మంగళవారం) లక్నోలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్, ఫరక్కాబాద్ లాంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి.. మహిళలపై నేరాల విషయంలో యూపీ ముందువరసలో ఉందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సరిగ్గా పని చేయకపోవడంతో మహిళలపై వేధింపులు భారీగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు సహా ప్రతి ఒక్కరి భద్రతకు రాష్ట్ర సర్కార్ పటిష్ట చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఇక, బహ్రైచ్లో తోడేళ్ల దాడిలో చోటు చేసుకుంటున్న మరణాలను ప్రస్తావిస్తూ యోగి ప్రభు..త్వం తన బాధ్యతలను విస్మరించడంతో ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భద్రతపై ఈ బీజేపీ సర్కార్ నిర్ధిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాల పట్ల యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు.