Leading News Portal in Telugu

Baby Born In Bus: బస్సులోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళా..


  • రాజస్థాన్ రాష్ట్రంలోని భివాడిలో.
  • పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులో మహిళ మగ బిడ్డకి జన్మనిచ్చింది.
  • దారిలోనే ఆ మహిళకు ప్రసవ నొప్పులు.
Baby Born In Bus: బస్సులోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళా..

Baby Born In Bus: రాజస్థాన్ రాష్ట్రంలోని భివాడిలో అల్వార్ – భివాడి హైవేపై పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులో ఒక మహిళా మగ బిడ్డకి జన్మనిచ్చింది. అల్వార్ చేరుకోకముందే ఆ మహిళకు ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. బస్సులో కూర్చున్న ప్రయాణికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఈ సమయంలో అంబులెన్స్ రాకముందే మహిళ బస్సులోనే ప్రసవించింది. ఇక ప్రసవం తర్వాత ఆ తల్లి, బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. సమాచారం ప్రకారం.. భరత్‌పూర్‌ కు చెందిన మహిళ భివాడిలో నివసిస్తోంది. ఆమె భర్త ఇక్కడే ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. వైద్యులను సంప్రదించేందుకు మహిళ తపుకాడలోని ఆసుపత్రికి చేరుకుంది. దీని తరువాత, ఆమె పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులో అల్వార్‌కు వస్తోంది. అల్వార్ నగరానికి 15 కిలోమీటర్ల ముందు అకస్మాత్తుగా ప్రసవ నొప్పి మొదలైంది.

Drunk Leaders : తాగుబోతు నేతల గూండాయిజం! యువకుడిని కొట్టి మొబైల్, పర్సు లాక్కెళ్లారు

దీంతో బస్సు డ్రైవర్‌ వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపడంతో.. ప్రయాణికులు 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. కొద్దిసేపటికే 108 అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకోగా, ఆ మహిళ బస్సులోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అంబులెన్స్ సిబ్బంది తల్లీబిడ్డల సంరక్షణ చేపట్టారు. అంబులెన్స్ సిబ్బంది కిషోర్ సింగ్ మాట్లాడుతూ.. మహిళకు మగబిడ్డ జన్మించాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇద్దరినీ అల్వార్‌లోని జనన్‌ ఆస్పత్రిలో చేర్పించాము. అంబులెన్స్ డ్రైవర్ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ.. భివాడి నుంచి అల్వార్‌కు వస్తుండగా ఆ మహిళకు అకస్మాత్తుగా ప్రసవ నొప్పి వచ్చిందని తెలిపారు. దారిలోనే మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు.