Leading News Portal in Telugu

Murder Attempt: దానం చేయలేదని వ్యక్తిని కత్తితో పొడిచిన యాచకుడు.. చివరికి.?


  • ఉత్తరప్రదేశ్‌ లోని బిజ్నోర్ జిల్లా నాయి బస్తీ 24లో ఘటన.
  • దానం చేయలేదని వ్యక్తిని కత్తితో పొడిచిన యాచకుడు..
  • పరిస్థితి ఇంకా విషమంగానే..
Murder Attempt: దానం చేయలేదని వ్యక్తిని కత్తితో పొడిచిన యాచకుడు.. చివరికి.?

Murder Attempt: ఉత్తరప్రదేశ్‌ లోని బిజ్నోర్ జిల్లా నాయి బస్తీ 24లో ఓ బిచ్చగాడు రోడ్డుపై వెళ్తున్న వారిని బిక్షాటన చేసేవాడు. అదే సమయంలో తనకు దానం చేయని వారిపై దుర్భాషలాడేవాడు. ఇకపోతే తాజాగా నాయి బస్తీ-24లో నివాసముంటున్న ఓ వ్యక్తి కూడా అటుగా వెళ్తున్నాడు. అయితే యాచకుడు అతనిని దానం చేయాలని వేడుకున్నాడు. కానీ, సదరు వ్యక్తి దానం చేయలేదు. దీనిపై యాచకుడు ఆ వ్యక్తిని దుర్భాషలాడడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి దానికి నిరసన తెలపడంతో యాచకుడు ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

Gun Fire: ఢిల్లీలో తుపాకీ కాల్పులతో వీరంగం సృష్టించిన దుండగులు.. (వీడియో)

ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో కొంతమంది ముందుగా పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు దాడి చేసిన యాచకుడిని పట్టుకున్నారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న ప్రజలు యాచకుడిని పోలీసులకు అప్పగించారు. ఇక క్షతగాత్రుడిని మాత్రం చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతున్నాడు. అయితే, వ్యక్తి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం.

Paris Paralympic Games 2024: భారత్ ఖాతాలో 29 పతకాలు.. పాయింట్ల పట్టికలో ఎన్నో స్థానంలో ఉందంటే..?

ఈ కేసులో కత్తితో పొడిచిన యాచకుడు వికలాంగుడని పోలీసులు తెలిపారు. అతను కిరాత్‌ పూర్ స్థానిక నివాసి. ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేశారు. అతని నుంచి కూరగాయలు కోసే కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కత్తితో నయీమ్‌ పై దాడి చేశాడు. నయీం ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. యాచకుడి నేర చరిత్రపై కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.