Leading News Portal in Telugu

Sitaram Yechury: సీతారాం ఏచూరి భౌతికకాయం ఎయిమ్స్‌కు దానం


  • సీతారాం ఏచూరి భౌతికకాయం ఎయిమ్స్‌కు దానం

  • ఏచూరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు అప్పగింత

  • దీంతో ఏచూరి అంత్యక్రియలు లేనట్లే!
Sitaram Yechury: సీతారాం ఏచూరి భౌతికకాయం ఎయిమ్స్‌కు దానం

ప్రముఖ రాజకీయ ఉద్దండుడు, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్‌లో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌పై చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం 3:05 గంటలకు కన్నుమూసినట్లుగా ఎయిమ్స్ వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇది కూడా చదవండి: Harish Rao: ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే వరకు సీపీ ఆఫీస్లోనే ఉంటాం..

ఇదిలా ఉంటే సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు దానం చేశారు. బోధన, పరిశోధన ప్రయోజనాల కోసం కుటుంబ సభ్యులు ఇన్‌స్టిట్యూట్‌కు విరాళంగా ఇచ్చారని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి దానం చేయడంతో ఇక ఆయన అంత్యక్రియలు ఉండవు. ఏచూరి కోరిక మేరకే కుటుంబ సభ్యుల ఇలా చేశారు. తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం ఇవ్వాలని ఏచూరి కోరారు.

ఇది కూడా చదవండి: Danam Nagender: కౌశిక్‌రెడ్డికి దానం వార్నింగ్.. స్థాయి తెలుసుకోవాలని హెచ్చరిక

1992 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్‌గా కూడా గుర్తింపు పొందారు. ఏచూరి మద్రాస్‌లో తెలుగు కుటుంబంలో 12 ఆగస్టు 1952న జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి. ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ మోహన్‌ కందాకు మేనల్లుడు. ఏచూరి బాల్యం హైదరాబాద్‌లోనే గడిచింది. సీతారాం మొదటి భార్య ఇంద్రాణి మజుందార్‌. జర్నలిస్టు సీమా చిశ్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. 2021 ఏప్రిల్ 22న కొవిడ్‌తో కొడుకు ఆశిష్ చనిపోయాడు.