Leading News Portal in Telugu

Biryani: డీఎంకే పార్టీ కార్యక్రమంలో బిర్యానీ.. 100 మందికి పైగా ఫుడ్ పాయిజన్..


Biryani: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ కార్యక్రమానికి హాజరైన ప్రజలు, అక్కడ వడ్డించిన బిర్యానీ తిని అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో బిర్యానీ తినడంతో 100 మందికి పైగా ఫుడ్‌ పాయిజనింగ్ అయింది. అస్వస్థతకు గురైన వారిలో 40 మంది చిన్నారులతో సహా 100 మంది అస్వస్థతకు గురయ్యారు.

Read Also: Rain Alert: బంగ్లాదేశ్‌ను ఆనుకుని అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!

బిర్యానీ తిన్న తర్వాత వాంతులు, వికారం వంటి లక్షణాలుతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. పార్టీ శ్రేణులు కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన సాధారణ సమావేశంలో ప్రజలకు సంక్షేమ సామాగ్రి పంపిణీ చేసిన తర్వాత సంఘటన జరిగింది. హాజరైన వారికి బిర్యానీ వడ్డించారు. కొందరు తమ కుటుంబ సభ్యుల కోసం ఇంటికి తీసుకెళ్లారు. అస్వస్థతకు గురైన వారిని విల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాధుతుల సంఖ్య పెరుగుతుండటంతో రోగులను చికిత్స కోసం సమీపంలోని విరుదు నగర్, కల్లికుడిలోని ఆరోగ్య కేంద్రాలకు తలరించేందుకు 10 అంబులెన్సుల్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు పాడైన ఆహారం ఇవ్వడం వల్లే ఫుడ్ పాయిజనింగ్ అయిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై తిరుమంగళం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.