Leading News Portal in Telugu

Kolkata Doctor Case: వైద్యుల డిమాండ్లకు తలొగ్గిన మమతా బెనర్జీ.. కోల్‌కతా టాప్ కాప్ తొలగింపు..


  • డాక్టర్ల డిమాండ్లకు తలొగ్గిన సీఎం మమతా బెనర్జీ..

  • కోల్‌కతా కమిషనర్ తొలగింపుకు ఓకే..

  • కోల్‌కతా ట్రైనీ డాక్టర్ ఘటనపై వైద్యుల ఆందోళన నేపథ్యంలో నిర్ణయం..
Kolkata Doctor Case: వైద్యుల డిమాండ్లకు తలొగ్గిన మమతా బెనర్జీ.. కోల్‌కతా టాప్ కాప్ తొలగింపు..

Kolkata Doctor Case: కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య సంఘటన తర్వాత యావత్ దేశంలో నిరసన, ఆందోలనలు నెలకొన్నాయి. ఇప్పటికీ బెంగాల్ వ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే, సోమవారం డాక్టర్లతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశం విజయవంతమైంది. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో డాక్టర్ల డిమాండ్లకు సీఎం తలొగ్గారు.

వైద్యులు చేసిన నాలుగు డిమాండ్లలో ప్రభుత్వం ఆమోదించింది. అత్యాచారం-హత్య కేసు విచారణను ఇప్పటికే సీబీఐ చేపట్టింది. ఇది కూడా డిమాండ్లలో ఉంది. కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ని తొలగించేందుకు సీఎం ఓకే చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు నిరసన చేపడుతామని వైద్యులు వెల్లడించారు. కోల్‌కతా కమిషనర్‌తో పాటు ఆరోగ్య శాఖలో ఇద్దరు ఉన్నతాధికారుల్ని కూడా తొలగించనున్నట్లు తెలుస్తోంది.

జూనియర్‌ వైద్యుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ కుమార్‌ గోయల్‌ రాజీనామాకు సిద్ధమని సమావేశంలో చెప్పారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు వినీత్‌ కొత్త సీపీకి బాధ్యతలు అప్పగిస్తారు’’ అని మమతా బెనర్జీ తెలిపారు. వైద్యులు ప్రతిపాదించిన 5 డిమాండ్లకు సీఎం అంగీకరించినట్లు తెలిసింది. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల డిమాండ్లను చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుందని ఆమె తెలిపారు. నిరసన తెలిపే వైద్యులపై ఎలాంటి శిక్షార్హత చర్యల్ని తీసుకోబోమని మమతా బెనర్జీ చెప్పారు.