Leading News Portal in Telugu

Delhi: ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖ.. దేనికోసమంటే..!


ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఖర్గే కోరారు. క్రమశిక్షణ లేని నాయకులను నియంత్రించాలని కోరుతున్నానని.. భారతీయ రాజకీయాలు పతనం కాకుండా ఉండాలంటే తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Purandeswari: వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఉద్దేశం అదే.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటించారు. అక్కడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్‌లో సిక్కులకు భద్రత లేదన్నారు. సిక్కులు తలపాగా ధరించాలన్నా భయపడుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. పలువురు బీజేపీ నేతలు రాహుల్‌పై నోరుపారేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు.. ప్రభుత్వం కొత్త పథకం..

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి మండిపడ్డారు. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే సిక్కులపై మారణకాండ జరిగిన విషయం రాహుల్ గాంధీకి గుర్తులేదా..? అని ప్రశ్నించారు. 1984 అల్లర్లలో 3000 మంది మరణించారని… తన స్నేహితులు చాలా మంది తలపాగాలను తొలగించారన్నారు. దాడికి భయపడి క్లీన్ షేవ్ చేసుకున్నారని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Devineni Avinash: వరద బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

Kharge