Leading News Portal in Telugu

JK Polls: ముగిసిన జమ్మూకాశ్మీర్ తొలి విడత పోలింగ్.. భారీగా ఓటింగ్ నమోదు!


  • ముగిసిన జమ్మూకాశ్మీర్ తొలి విడత పోలింగ్

  • భారీగా ఓటింగ్ నమోదు!
JK Polls: ముగిసిన జమ్మూకాశ్మీర్ తొలి విడత పోలింగ్.. భారీగా ఓటింగ్ నమోదు!

జమ్మూకాశ్మీర్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం 24 నియోజకవర్గాల్లో ఫస్ట్ ఫేజ్-1 ఓటింగ్ జరిగింది. ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. ఉదయం నుంచే ఓటర్లు.. ఓటేసేందుకు భారీగా క్యూ కట్టారు. దీంతో భారీగానే పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. మొత్తం 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Delhi: సెప్టెంబర్ 21న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న అతిషి..!

జమ్మూకశ్మీర్‌లో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 24 నియోజకవర్గాల్లో మొత్తం 23 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ), పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) ప్రధానంగా పోటీ పడ్డాయి. రెండో విడత సెప్టెంబర్ 25న జరగనున్నాయి. మూడో విడత పోలింగ్ అక్టోబర్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదలకానున్నాయి.

ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ కోరికే తప్ప.. వ్యూహాలు లేవు..!