- జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో ఘోర ప్రమాదం
-
బీఎస్‌ఎఫ్ బస్సు కాలువలో పడి ముగ్గురు జవాన్లు మృతి -
పలువురు జవాన్లకు గాయాలు.

జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) బస్సు కాలువలో పడిపోవడంతో ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోంది. పలువురు జవాన్లకు గాయాలయ్యాయి.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల కోసం భద్రతా దళాలు బస్సులో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన బస్సులో 35 మంది సైనికులు ఉన్నారు. గాయపడిన సైనికులందరినీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.