- జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంతంగా ముగిసిన రెండో విడత పోలింగ్
-
సాయంత్రం 5 గంటల వరకు 54 శాతం పోలింగ్ నమోదు -
మూడో విడత పోలింగ్ అక్టోబర్ 1న జరగనుంది
జమ్మూ కాశ్మీర్‌లో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు సాయంత్రం 5 గంటల వరకు 54 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో 26 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ బూతులకు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండో విడతలో 239 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా, బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీంద్ర రైనా పోటీలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Koratala Siva: అల్లు అర్జున్ సినిమా.. అసలు విషయం చెప్పిన కొరటాల
సెప్టెంబర్ 18న తొలి విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. సెకండ్ విడత కూడా దాదాపు అదే రేంజ్‌లో సాగింది. ఇక మూడో విడత అక్టోబర్ 1న జరగనుంది. మిగిలిన అన్ని స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Minister BC Janardhan Reddy: మౌలిక సదుపాయాల కల్పన ఆర్థికాభివృద్ధికి వెన్నెముక