- ఢిల్లీ సీఎం అతిషికి జెడ్ కేటగిరీ భద్రత కేటాయింపు
-
ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర హోంశాఖ నిర్ణయం -
కార్మికుల కనీస వేతనాన్ని పెంచిన సీఎం అతిషి

ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి ఢిల్లీ పోలీసులు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అతిషికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వర్తిస్తుంది. ప్రోటోకాల్ ప్రకాశం ఆమె కాన్వాయ్‌లో ఇకపై పైలట్ సహా పోలీసు సిబ్బందితో భద్రత కల్పించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి రక్షణగా ఢిల్లీ పోలీసులు 22 మందితో వంతుల వారీగా మోహరించనున్నారు. జెడ్ కేటగిరీలో పీఎస్‌వోలు, ఎస్కార్ట్స్, సాయుధ గార్డులు ఉంటారు. ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ.. ఆమె భద్రతను సమీక్షించే అవకాశం ఉంటుందని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
ఇది కూడా చదవండి: Israel-Lebanon War: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భారీ దాడులు
సెప్టెంబర్ 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల ఆమె బాధ్యతలు చేపడుతూ కేజ్రీవాల్ కుర్చీని పక్కన పెట్టి మరొక చైర్‌లో కూర్చుని బాధ్యతలు స్వీకరించారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ఆరు నెలలు తీహార్ జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇటీవలే విడుదలయ్యారు. అయితే అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషికి బాధ్యతలు అప్పగించారు. ఇలా అతిషికి అదృష్టం దక్కింది.
ఇది కూడా చదవండి: UP: మహిళతో లేచిపోయిన తమ్ముడు.. అన్నకు శిక్ష..
కార్మికులకు దసరా శుభవార్త
ఇక తాజాగా ముఖ్యమంత్రి అతిషి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో అసంఘటిత రంగంలోని కార్మికుల కనీస వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయని అతిషి వెల్లడించారు. తాజా నిర్ణయంతో నైపుణ్యం లేని కార్మికులకు కనీస వేతనం రూ.18,066, మధ్యస్తంగా నైపుణ్యం కలిగిన వారికి రూ.19,929, నైపుణ్యం కలిగినవారికి రూ.21,917కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సామాన్య ప్రజలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు అవసరమైన ప్రతి చర్యను ప్రభుత్వం చేపడుతుందని అతిషి తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దేశంలోనే అత్యధిక కనీస వేతనాలను అమలు చేసిందని విలేకరుల సమావేశంలో అతిషి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Vettaiyan-The Hunter: ‘వేట్టయన్’ రజినీకాంత్ దిగాడు.. అంచనాలు రేపుతున్న ప్రివ్యూ వీడియో