Leading News Portal in Telugu

Rahul Gandhi: దళితుడి ఇంట్లో రాహుల్ హల్ చల్.. వంట చేసుకుని తినొచ్చారు


  • మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ దళిత కుటుంబాన్ని కలిసిన రాహుల్ గాంధీ.
  • వారితో కలిసి వంటలు చేసిన రాహుల్.
  • దళితులు ఏం తింటారో ఎవరికీ తెలియదని రాహుల్ ట్వీట్..
Rahul Gandhi: దళితుడి ఇంట్లో రాహుల్ హల్ చల్.. వంట చేసుకుని తినొచ్చారు

Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ దళిత కుటుంబాన్ని కలిశారు. ఈ సందర్భంగా వంట గదిలో వారితో కలిసి వంటలు వండి కుల, వివక్ష వంటి పలు అంశాలపై చర్చించారు. అజయ్ తుకారాం సనాదే, ఆయన సతీమణి అంజనా తుకారాం సనాదేని కలిసిన అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దళితుల వంటశాల గురించి నేటికీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసునని అన్నారు. షాహూ పటోలే చెప్పినట్లు దళితులు ఏం తింటారో ఎవరికీ తెలియదని రాహుల్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ లో “వారు ఏమి తింటారు, ఎలా వండుతారు? దాని సామాజిక, రాజకీయ ప్రాముఖ్యత గురించి నేను అజయ్ తుకారాం సనాదే ఇంకా ఆయన భార్య అంజనా తుకారాం సనదేతో ఒక మధ్యాహ్నం గడిపాను” అని రాహుల్ రాసుకొచ్చారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న తన ఇంటికి నన్ను గౌరవంగా ఆహ్వానించి వంటగదిలో సహాయం చేసే అవకాశం ఇచ్చారు. మేమంతా కలిసి బెండకాయతో ‘హర్భయాచి భాజీ’ పచ్చిమిర్చి, తువర్ పప్పు తయారు చేసామని తెలిపారు.

Mohamed Muizzu: రాష్ట్రపతి భవన్‌లో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు..

అలాగే పటోలే, సనాదే కుటుంబానికి చెందిన కుల వివక్ష వ్యక్తిగత అనుభవాల గురించి మాట్లాడుతున్నప్పుడు.., దళితుల ఆహారంపై అవగాహన లేకపోవడం, ఇంకా ఆ సంస్కృతి ప్రాముఖ్యత గురించి మేము చర్చించామని., రాజ్యాంగం బహుజనులకు వాటా ఇంకా హక్కులను ఇస్తుందని తెలుపుతూ.. మేము ఆ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాము, అయితే ప్రతి భారతీయుడు తన హృదయంలో సోదర భావంతో కృషి చేసినప్పుడే సమాజంలో అందరినీ కలుపుకొని సమానత్వం సాధ్యమవుతుందని తెలిపారు.