Leading News Portal in Telugu

Lalu Prasad Yadav: ఢిల్లీ కోర్టులో లాలు ప్రసాద్, తేజస్వీయాదవ్‌లకు బిగ్ రిలీఫ్..


  • ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలు ప్రసాద్- తేజస్వీయాదవ్ లకు బిగ్ రిలీఫ్..

  • లాలు ప్రసాద్ యాదవ్ తో పాటు ఇద్దరు కుమారులకు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు..
Lalu Prasad Yadav: ఢిల్లీ కోర్టులో లాలు ప్రసాద్, తేజస్వీయాదవ్‌లకు బిగ్ రిలీఫ్..

Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్, ఆయన తనయులు తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. కొద్దిసేపటి క్రితం బెయిలు మంజూరు చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. కాగా, ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే బెయిలు మంజూరు చేస్తూ.. ఒక్కొక్కరు రూ. లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణ సందర్భంగా వారిని అరెస్ట్ చేయొద్దని దర్యాప్తు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముగ్గురూ తమ పాస్‌పోర్టులను సమర్పించాలని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను అక్టోబర్ 25కి వాయిదా వేసింది.

ఇక, 2004 నుంచి 2009 వరకు కేంద్ర రైల్వే మంత్రిగా పని చేసిన లాలూ ప్రసాద్ యాదవ్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న వెస్ట్ సెంట్రల్ జోన్ రైల్వేలో గ్రూప్-డి ఉద్యోగాల కోసం వ్యక్తులను రిక్రూట్‌మెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతని పేరు మీద ఉన్న భూములు అతని కుటుంబం లేదా సహచరుల పేరు మీదకు మార్చినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి.