Leading News Portal in Telugu

Jammu Kashmir Elections: లెఫ్టినెంట్ గవర్నర్ ప్రత్యేక అధికారంపై రచ్చ రచ్చ


  • అసెంబ్లీకి ఐదుగురు సభ్యులను నామినేట్ చేసే ప్రత్యేక అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కు.
  • అధికారం ఇవ్వడంపై పెద్ద ఎత్తున వివాదం.
Jammu Kashmir Elections: లెఫ్టినెంట్ గవర్నర్ ప్రత్యేక అధికారంపై రచ్చ రచ్చ

Jammu Kashmir Elections: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఐదుగురు సభ్యులను నామినేట్ చేసే ప్రత్యేక అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కు ఇవ్వడంపై పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. “డీలిమిటేషన్” (అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన) తర్వాత, జమ్మూ ప్రాంతంలో అసెంబ్లీ స్థానాలు సంఖ్య 43 కాగా, కాశ్మీర్ లోయలో అసెంబ్లీ స్థానాలు సంఖ్య 47 గా విభజించబడ్డాయి. “డీలిమిటేషన్” తర్వాత మొత్తం 90 అసెంబ్లీ స్థానాలే కాకుండా, అదనంగా గవర్నర్ మరో ఐదుగురు సభ్యులను నామినేట్ చేసే అధికారాలు వచ్చాయి. ఐదుగురు నామినేటేడ్ సభ్యుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు కాశ్మీరి పండిట్ లు, “పాక్ ఆక్రమిత కాశ్మీర్”(పిఓకే) నుంచి ఒకరికి అవకాశం కల్పించాలి.

Tirumala Garuda Seva: తిరుమల బ్రహ్మోత్సవాల్లో నేడు ముఖ్యమైన ఘట్టం.. భక్తులకు అలర్ట్..

దీంతో 90 నుంచి 95 కి అసెంబ్లీ సభ్యుల సంఖ్య పెరిగింది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన “మ్యాజిక్ ఫిగర్” కూడా 46 నుంచి 48 కి మార్పు చేసారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత లెఫ్ననెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఐదుగురు సభ్యులను నామినేట్ చేయడం, బీజేపీకి సహకరించేందుకేనని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాయి “నేషనల్ కాన్ఫరెన్స్”, పిడిపి, కాంగ్రెస్ పార్టీలు. ఇలాంటి ఏ ప్రయత్నమైనా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని, కించపరచడమేనని విమర్శించాయి “ఇండియా” కూటమి పార్టీలు. ఎన్నికైన అసెంబ్లీ సభ్యులకు ఉన్న అధికారాలు, ఆ ఐదుగురు సభ్యులకు కూడా పూర్తి స్థాయి అధికారాలుంటాయు. అయితే ఈ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయుస్తామని “నేషనల్ కాన్ఫరెన్స్” అగ్రనేత ఫరూఖ్ అబ్దుల్లా తెలిపారు.

Amazon-MX Player: ఎంఎక్స్‌ ప్లేయర్‌ను కొనుగోలు చేసిన అమెజాన్‌.. రీ ఇన్‌స్టాల్‌, అప్‌గ్రేడ్‌ అవసరం లేదు!