- నేడు హరియాణా & జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.
- హరియాణాలో పోటాపోటీ.
- జమ్మూకశ్మీర్‌లో వార్ వన్ సైడ్

Elections Results: నేడు హరియాణా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం నుండి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హరియాణా రాష్ట్రములోని ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. కౌంటింగ్ మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో జోరు చూపించగా.. ఆ తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకుంది. దీంతో రెండు జాతీయ పార్టీల మధ్య ఆధిక్యం దోబూచులాడుతోందని చెప్పవచ్చు. దింతో రాజకీయ నాయకులు టెన్షన్.. టెన్షన్.. గా ఉన్నారు. ఇకపోతే అటు జమ్మూకశ్మీర్ లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి భారీ లీడ్ లో దూసుకెళ్తోంది.
ఇకపోతే ఉదయం 10 గంటల వరకు నమోదైన పలితాల సరళిని ఒకసారి పరిశీలిస్తే.. హరియాణా రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం కాగా.. ప్రస్తుతం అక్కడ బీజేపీ 45 స్థానాల్లో ముందంజలో ఉండగా మరోవైపు కాంగ్రెస్ ఆధిక్యం 38కి పడిపోయింది. అలాగే ఇతరులు విషయానికి వస్తే వారు.. 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇందులో ఐఎన్‌ఎల్‌డీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఖాతా తెరవకపోవడం గమనార్హం.
ఇక జమ్మూకశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకెళ్తోంది. ఆ పార్టీ ప్రస్తుతం 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 23, పీడీపీ 3, కాంగ్రెస్ 9 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అలాగే ఇతరులు ఏకంగా 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ, పీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి. జమ్మూలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ లో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.