Leading News Portal in Telugu

Bengaluru: ఇంత దారుణమా.. తండ్రి అప్పు కట్టలేదని కూతురిపై అత్యాచారం


  • బెంగళూరులో తండ్రి అప్పు చెల్లించలేదని కూతురిపై అత్యాచారం..

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు..

  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు..
Bengaluru: ఇంత దారుణమా.. తండ్రి అప్పు కట్టలేదని కూతురిపై అత్యాచారం

Bengaluru: కర్ణాటక రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఉత్తర తాలూకాలో అమానుష ఘటన జరిగింది. ఓ వ్యక్తి లోన్ చెల్లించలేదని అతని మైనర్‌ కుమార్తెపై వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు. మాదనాయకనహళ్లిలో ఆదివారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని తక్షణమే అరెస్టు చేశారు.

ఇక, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మేరకు రవి కుమార్‌ (39) దగ్గర బాలిక తండ్రి 70 వేల రూపాయల అప్పు తీసుకుని 30 వేల రూపాయలు తిరిగి చెల్లించాడు. మరో రూ.40 వేలు అసలుతో పాటు వడ్డీ చెల్లించాల్సి ఉండగా.. ఆ మొత్తం వసూలు చేసుకునేందుకు తరచూ రవికుమార్‌ బాలిక తండ్రి కోసం ఇంటికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లి అప్పు చెల్లించాలని బాలికపై బెదిరింపులకు దిగాడు.. ఆ తర్వాత మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా, మైనర్‌కు బలవంతంగా బుగ్గపై ముద్దు పెట్టి ఆ ఫొటోను నెట్టింట షేర్ చేస్తానని బాలిక తండ్రిని బెదిరించాడు. ఈ విషయాన్ని మైనర్ కుటుంబం పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయడంతో అతనిపై కేసు ఫైల్ చేశారు.