Leading News Portal in Telugu

Maharashtra Elections: పొత్తుల సిగపట్లు.. మరోసారి ‘‘మహ వికాస్ అఘాడీ’’ భేటీ..


  • మహారాష్ట్ర ఎన్నికల్లో కుదరని పొత్తులు..

  • మహా వికాస్ అఘాడీలో ఫైనలైజ్ కానీ సీట్లు..

  • ఠాక్రే.. కాంగ్రెస్ మధ్య విభేదాలు..

  • సీట్ల షేరింగ్‌పై సమావేశాలు..
Maharashtra Elections: పొత్తుల సిగపట్లు.. మరోసారి ‘‘మహ వికాస్ అఘాడీ’’ భేటీ..

Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు దాదాపుగా ఒక నెల మాత్రమే సమయం ఉంది. నవంబర్ 20న ఆ రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో మహా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ప్రతిపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ’’లో ఇంకా పొత్తులు కన్ఫామ్ కాలేదు. శివసేన ఠాక్రే వర్గానికి, కాంగ్రెస్‌కి మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ మధ్య సీట్ల షేరింగ్‌పై వివాదం కొనసాగుతున్న తరుణంలో ఈ రోజు సీట్ల పంపకాలకు సంబంధించి కీలక సమావేశం నేడు జరుగనుంది. ముంబై, నాసిక్, విదర్భలలో కొన్ని సీట్లకు సంబంధించిన రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఈ రెండు పార్టీల మధ్య సీనియర్ నేత శరద్ పవార్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్, పవార్ మధ్య మీటింగ్ జరిగింది. దీని తర్వాత ఉద్దవ్ ఠాక్రే వార్గం కాంగ్రెస్ మధ్య మరో సమావేశం జరిగింది. రెండు రోజుల్లో సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే చెబుతున్నాడు.

నిన్న, శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ, 288 అసెంబ్లీ సీట్లలో 210 సీట్లపై ఎంవిఎ ఏకాభిప్రాయానికి వచ్చిందని, నానా పటోలే ఆ సంఖ్య 96 అని పేర్కొన్నారు. మొత్తం 288 సీట్లలో కాంగ్రెస్ 125 సీట్లు కోరుతోంది. అయితే, శివసేన మాత్రం చెరో 100 సీట్లు తీసుకుని, ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి 88 సీట్లు ఇవ్వాలని బేరసారాలు సాగిస్తోంది.