Leading News Portal in Telugu

Boost for Akali Dal as Harjinder Dhami wins top Sikh body SGPC election again


  • పంజాబ్‌లో కీలక రాజకీయ పరిణామం..

  • రోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ ఎన్నికల్లో అకాలీదల్ గెలుపు..

  • వరస ఓటముల మధ్య ఓదార్పు విజయం.. అకాలీదళ్‌కి బూస్ట్..
Akali Dal: అకాలీదళ్‌కి బూస్ట్.. సిక్కు ప్యానెల్ ఎన్నికల్లో విజయం..

Akali Dal: పంజాబ్‌లో వరస ఓటములతో ఢీలా పడిన శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ)కి ఊరట విజయం దక్కింది. ఈ పార్టీకి చెందిన అభ్యర్థి హర్జిందర్ సింగ్ ధామీ సిక్కుల అత్యున్నత సంస్థ అయిన శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(SGPC) అధ్యక్షుడిగా వరుసగా నాలుగోసారి తిరిగి ఎన్నికయ్యారు. ఈ గెలుపు పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌కి కొత్త ఊపుని ఇచ్చింది. సోమవారం జరిగిన ఎన్నికల్లో ధామి విజయం సాధించారు. అంతకుముందు రోజు తేజాసింగ్ సముందరి హాల్‌లో జరిగిన ఎన్నికల్లో SGPC మాజీ అధ్యక్షురాలు, అకాలీదళ్ తిరుగుబాటు వర్గానికి చెందిన అభ్యర్థి బీబీ జాగీర్ కౌర్ ధమీపై విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో 142 మంది SGPC సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధామి 107 ఓట్లతో గెలుపొందగా, జాగీర్ కౌర్‌కి 33 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇటీవల కాలంలో అకాలీదళ్ అంతర్గత విభేదాల కారణంగా కొందరు సీనియర్ నాయకుడు ఆ పార్టీ నుంచి విడిపోయి రెబల్ గ్రూపుగా ఏర్పడ్డారు.

పంజాబ్ రాజకీయాల్లో ఒకప్పుడు ఆధిపత్య శక్తిగా ఉన్న అకాలీదళ్ ఇప్పుడు క్షీణించింది. 2007 నుంచి 2017 వరకు అధికారంలో పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఈ పార్టీ, 2017 ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో పంజాబ్‌లో కేవలం 15 స్థానాలను మాత్రమే గెలిచింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్ నాయకత్వంలోని ఈ పార్టీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలిచింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సిక్ ప్యానెల్ ఎన్నికల్లో అకాలీదళ్ విజయం సాధించడం, ఆ పార్టీ నేతలకు ఊరట కలిగింది.