Leading News Portal in Telugu

West Bengal Doctor Arrested For Raping Patient After Tranquilizing Her


  • పశ్చిమ బెంగాల్‌లో దారుణం..

  • వైద్యం కోసం వచ్చిన మహిళపై అత్యాచారం..
Crime: ట్రాంక్విలైజింగ్ ఇంజెక్షన్స్ ఇచ్చి.. మహిళ పేషెంట్‌పై డాక్టర్ అత్యాచారం..

Crime: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. నార్త్ 24 పరగణాల జిల్లాలోని హస్నాబాద్‌లో వైద్యం కోసం వచ్చి మహిళా పేషెంట్‌పై డాక్టర్ అత్యాచారం చేశాడు. యాంగ్జైటీ, టెన్షన్ పరిస్థితుల్లో మాససిక ప్రశాంతత కోసం ఇచ్చే ట్రాంక్విటైజింగ్ సీరమ్ ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారానిక ఒడిగట్టాడు. ఈ కేసులో సదరు వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

కొద్దిరోజుల క్రితం మహిళ భర్త రాష్ట్రంలో లేని సమయంలో చికిత్స నిమిత్తం వైద్యుడిని వద్దకు వెళ్లింది. ఆమెకు మొదటగా ట్రాంక్విలైజింగ్ ఇంజెక్షన్ ఇచ్చి, ఆమె పూర్తిగా ప్రశాంతంగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి అభ్యంతరకరమైన ఫోటోలు తీసుకుని, వాటిని వైరల్ చేస్తానని బెదిరించి బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు రేప్ చేశాడు. బాధిత మహిళ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి రూ. 4 లక్షలను బలవంతంగా తీసుకున్నాడని తెలిసింది.

అయితే, మొదట్లో తన పరువు పోతుందని మహిళ ఎవరికి చెప్పలేదు. ఆ సమయంలో భర్త తనకు అందుబాటులో లేకపోవడంతో నిస్సాహయస్థితిలో ఉన్నానని బాధిత మహిళ చెప్పింది. ఇటీవల భర్త సొంత ప్రాంతానికి తిరిగి వచ్చిన తర్వాత తనకు జరిగిన విషయాన్ని చెప్పింది. నిందితుడపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్‌ని పోలీసులు రికార్డ్ చేసుకుని, నిందితుడైన డాక్టర్‌ని ఐదురోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు.